RRR హవా.. నెట్ ఫ్లిక్స్ సీఈఓ ఏమన్నారంటే?

Update: 2022-07-03 08:30 GMT
ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ RRR సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శక వీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకువచ్చిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరూ కూడా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా విడుదలై నేటికీ వంద రోజులు పూర్తయింది.

కేవలం బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా ఓటీటీ లో కూడా ఈ సినిమాకు భారీ స్థాయిలో స్పందన లభించడం విశేషం. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ లో హిందీలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ సినిమాను చాలామంది వీక్షించారు. ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్స్ తో పాటు చాలామంది విదేశీయులు కూడా సినిమాను చూసి ప్రశంసల జల్లులు కురిపించారు. సోషల్ మీడియాలో గత కొంతకాలంగా ఎక్కడ చూసినా కూడా RRR కు సంబంధించిన రివ్యూలు దర్శనం ఇచ్చాయి.

ఈ సినిమా అద్భుతంగా ఉంది అంటూ భారతీయ చిత్ర పరిశ్రమలో ది బెస్ట్ మూవీ అని కూడా చాలామంది ప్రముఖులు పాజిటివ్ గా స్పందించారు. అయితే ఓటీటీ లో కూడా ఒక విధంగా సినిమాకు భారీ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది అని చెప్పవచ్చు. ఈ క్రమంలో OTT దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ యొక్క CEO టెడ్ సరండోస్ RRR గురించి స్పందించారు.  అతను తన ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ లో ఈ విధంగా ఒక వివరణ ఇచ్చారు.

"మీరు ఇంకా నెట్‌ఫ్లిక్స్‌లో RRRని తనిఖీ సెర్చ్ చేయకుంటే, మీరు తప్పక చూడండి.  ఈ సంవత్సరం మీరు చూడబోయే చలనచిత్రంలో ఇది అత్యంత క్రేజీ థ్రిల్ రైడ్. ఒక బ్లాస్ట్ మూవీ.. అని వివరణ ఇచ్చారు.  మొత్తానికి RRR సినిమాతో దారుణంగా నష్టాల్లో కూరుకుపోయిన RRR నెట్ ఫ్లిక్స్ కు కొంత బూస్ట్ ఇచ్చింది అని చెప్పాలి. ముఖ్యంగా ఇండియాలో నెట్ ఫ్లిక్స్ కు మంచి ఆదరణ లభించింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మొత్తంగా 1200 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. ఈ సినిమా ఇటీవల హాలీవుడ్ క్రికెట్ ఛాయిస్ అవార్డ్స్ లో కూడా రన్నరప్ గా నిలవడం విశేషం.
Tags:    

Similar News