కోలీవుడ్ పాపులర్ లవ్ బర్డ్స్ గా వైరల్ అయిన జోడీ నయనతార, విఘ్నేష్ శివన్. గత ఐదేళ్లుగా ప్రేమలో వున్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కిన విషయం తెలిసిందే. జూన్ 9న అత్యంత భారీ స్థాయిలో అట్టహాసంగా వీరి వివాహం జరిగింది. చెన్నై సమీపంలోని మహాబలిపురంలోగల రిసార్ట్ లో ఇరు కుటుంబాల వారు, బంధు మిత్రుల సపరివార సమేతంగా నయనతార, విఘ్నేష్ శివన్ ల వివాహ వేడుక జరిగింది. ఈ పెళ్లిలో కోలీవుడ్ కు సంబంధించిన స్టార్స్ కపుల్స్, స్టార్స్ చాలా మంది పాల్గొన్నారు.
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, దిగ్గజ దర్శకుడు మణిరత్నం, బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తో పాటు హీరో సూర్య, జ్యోతిక, కార్తి, జయం రవి అండ్ ఫ్యామిలీ, అట్లీకుమార్ అండ్ ఫ్యామిలీ, సంగీత సంచలనం అనిరుథ్, ఏ. ఆర్. రెహమాన్ తదితర స్టార్ సెలబ్రిటీలు ఎంతో మంది ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. పెళ్లి వేడుక మరనురాని ఈవెంట్ గా నిలవాలని దీని కోసం నయనతార, విఘ్నేష్ శివన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు.
ఓ స్పెషల్ ఈవెంట్ గా ప్లాన్ చేసి దీనికి షూటింగ్ బాధ్యతల్ని లవ్ స్టోరీస్ మాస్టర్ గౌతమ్ మీనన్ కు అప్పగించారు. దీని స్ట్రీమింగ్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కి భారీ మొత్తానికి అమ్మేశాకరు కూడా. అడ్వాన్స్ గా టోకెన్ అమౌంట్ ని సొంతం చేసుకున్నారట. పెళ్లి వీడియో స్ట్రీమింగ్ హక్కుల కింద 25 కోట్లకు నెట్ ఫ్లిక్స్ తో డీల్ కుదుర్చుకున్నారట. అయితే ఇటీవల విఘ్నేష్ శివన్ విడుదల చేసిన ఫొటోల కారణంగా నెట్ ఫ్లిక్స్ తను కుదుర్చుకున్న డీల్ ని క్యాన్సిల్ చేసుకుని వెనక్కి తగ్గిందని వార్తలు మొదలయ్యాయి.
దీని కారణంగా నయనతార, విఘ్నేష్ శివన్ ల జంట భారీ మొత్తాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడిందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలపై ఇండైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ క్లారిటీ ఇచ్చింది. గురువారం నయనతార, విఘ్నేష్ శివన్ ల ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ కి సంబంధించిన ఫొటోలని ట్విట్టర్ ద్వారా షేర్ చేసి 'నయనతార, విఘ్నేష్ శివన్ స్టార్స్ లా కనిపిస్తున్నారు. ఈ ఇద్దరు నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేస్తున్నారు.
ఈ సంతోషకర సమయంలో మేము అనందంగా డ్యాన్స్ చేస్తున్నాం' అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో నయనతార, విఘ్నేష్ శివన్ ల పెళ్లి వీడియో స్ట్రీమింగ్ పై గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు బ్రేక్ పడింది.
అంతా బాగానే వుంది కానీ పెళ్లి వీడియో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందన్న విషయాన్ని మాత్రం నెట్ ఫ్లిక్స్ వర్గాలు వెల్లడించకపోవడం గమనార్హం. స్ట్రీమింగ్ వీడియో పై క్లారిటీ ఇచ్చిన నెట్ ఫ్లిక్స్ త్వరలో నే స్ట్రీమింగ్ కి సంబంధించిన డేట్ ని కూడా ప్రకటించే అవకాశం వుందని తెలిసింది. విఘ్నేష్ శివన్ త్వరలో తల అజిత్ హీరోగా ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని చేయబోతున్న విషయం తెలిసిందే.