ప్రస్తుతం దేశంలో పరిస్థితి చూస్తుంటే మరో కొన్ని నెలల వరకు సినిమా థియేటర్లు తెరుచుకునే అవకాశాలు కన్పించడం లేదు. జనాలు కూడా లాక్ డౌన్ వల్ల ఓటిటిలకు బాగా అలవాటు పడ్డారు. ఈ అవకాశాలను క్యాష్ చేసుకునేందుకు అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటిటి సంస్థలు చిన్న సినిమాలను, మీడియం రేంజ్ సినిమాల హక్కులను సొంతం చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను కొనుక్కొని థియేటర్లో కాకుండా డైరెక్టుగా ఓటిటిలో విడుదల చేయాలని నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతున్న విషయం తెలిసిందే. తక్కువ బడ్జెటుతో రూపొంది నష్టం లేని బేరాలు చిన్న సినిమాలకే సాధ్యం అవుతుంది.
ప్రస్తుతం భారీ సినిమాల హక్కులు కొనేందుకు కూడా ఓటిటి ప్లాట్ ఫామ్ లు సిద్ధం అవుతున్నాయి. ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభం నుంచీ ఇంతవరకు హిట్ లేని హీరో అక్కినేని అఖిల్. అతని నాలుగో సినిమాగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' రూపొందుతుంది. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పై అక్కినేని ఫ్యామిలీ, అక్కినేని అభిమానులు ఆశలు మాములుగా పెట్టుకోలేదు. గీతా గోవిందం తరహాలో ఇదో రొమాంటిక్ ఎంటర్టైనర్. జీఏ2 పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా కరోనా కోరల్లో చిక్కుకొని విడుదల వాయిదా పడుతూ వచ్చింది. సినిమా మొత్తం విడుదలకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది.
అయితే తాజాగా నాగార్జునను ఈ సినిమాను అమ్మాలని నెట్ ఫ్లిక్స్ వారు సంప్రదించినట్లు వార్తలొస్తున్నాయి. అందుకు నాగ్ ససేమిరా నో అనేసారట. ఎందుకంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. అందుకని ఏమున్నా.. వారి నిర్ణయమే ముఖ్యమని తెలిపాడట. కానీ సినిమా విడుదల పై యూనిట్ స్పందించి ఈ సినిమాను ఎంత ఆలస్యం అయినా థియేటర్లోనే విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్.. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాను ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలా.. లేదా ఇయర్ ఎండింగ్ లోపు ఎలాగైనా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే