నెట్ ఫ్లిక్స్ `ఘోస్ట్ స్టోరీస్‌` ఫిల్మ్.. అనురాగ్ కశ్యప్ పై COE ఫిర్యాదు

Update: 2021-07-31 04:30 GMT
నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ ఘోస్ట్ స్టోరీస్ లో అనురాగ్ కశ్యప్ షార్ట్ ఫిల్మ్ పై ఫిర్యాదు నమోదైంది. కొత్త  ఐటి(ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ) చట్టంలో COE (కోడ్ ఆఫ్ ఎథిక్స్) అమల్లోకి వచ్చిన త‌ర్వాత‌ తొలి సంచ‌ల‌న‌ ఫిర్యాదు ఇది. నెట్ ఫ్లిక్స్ ఇండియా 2020 సంకలనం ఘోస్ట్ స్టోరీస్ లో అనురాగ్ కశ్యప్ ల‌ఘు చిత్రం ఎథిక్స్ ని అధిగ‌మించింది.  సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సమాచార సాంకేతికత (మధ్యవర్తులు మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ కోసం మార్గదర్శకాలు) రూపొందించిన కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ తర్వాత ఫిర్యాదుల నమోదులో భాగంగా తొలి ఫిర్యాదుగా ఈ షార్ట్ ఫిలిం చ‌ర్చ‌ల్లోకొచ్చింది.

ప్ర‌ముఖ బాలీవుడ్ మీడియా క‌థ‌నం ప్రకారం... ఫిర్యాదీ.. షార్ట్ ఫిల్మ్ లోని ఒక సన్నివేశంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందులో శోభిత ధూళిపాళ పాత్ర గర్భస్రావం అయిన తర్వాత పిండం తింటుంది. నిజానికి ఆ క‌థ‌లో ఆ దృశ్యం అవసరం లేదు. సృష్టికర్తలు అలాంటి దృశ్యాన్ని జోడించాలనుకుంటే.. గర్భస్రావాల వేద‌న‌ను ఎదుర్కొన్న మహిళలకు అది ఒక ఘోర‌మైన‌ హెచ్చరిక అవుతుంది`` అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కొత్త‌గా వ‌చ్చిన ఐటీ చ‌ట్టం ప్ర‌కారం.. ఇలాంటి ఫిర్యాదులను తప్పనిసరిగా 24 గంటలలోపు నమోదు చేయాలి .. వీలైనంత త్వరగా పరిష్కరించాలి. నెట్ ఫ్లిక్స్ ఇండియా ప్రతినిధిని ఉటంకిస్తూ, ``ఇది భాగస్వాముల‌ నిర్వహణలో ఉన్న ప్రొడ‌క్ట్ (RSVP మూవీస్ - ఫ్లయింగ్ యునికార్న్ ఎంటర్ టైన్ మెంట్) కాబట్టి ఫిర్యాదును షేర్ చేసుకోవ‌డానికి మేము నిర్మాణ సంస్థను సంప్రదించాము`` అని తెలిపారు.

మొన్న‌టివ‌ర‌కూ డిజిటల్ న్యూస్ మీడియా ఎక్కువగా నియంత్రించబడలేదు. కొత్త చట్టాల పరిచయం డిజిటల్ సృష్టికర్తలపై నియంత్రణ తో పాటు ఆంక్షలను విధించే ప్రయత్నంగా చాలామంది చూస్తారు. కాబట్టి ఇది ప్రారంభమైంది ... ఘోస్ట్ స్టోరీస్ పై నెట్ ఫ్లిక్స్ కు ఫిర్యాదు వచ్చింది. ``ఇది ముగింపు`` అంటూ అనురాగ్ ఈ సంద‌ర్భంగా తన ఇన్ స్టా లో ఆవేద‌న చెందారు.  అది తన ప్రొఫైల్ లో కనిపించదు కానీ మీడియా వెతికింది. అనురాగ్ - క‌మ‌ల్ హాస‌న్ స‌హా ఎంద‌రో సినీప్ర‌ముఖులు కొత్త ఐటీ చ‌ట్టాన్ని స‌వ‌ర‌ణ బిల్లును వ్య‌తిరేకిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఘోస్ట్ స్టోరీస్ క‌ర్త‌లు జోయా అక్తర్- దిబాకర్ బెనర్జీ- కరణ్ జోహార్ త‌దిత‌రుల సృష్టి. వీరంతా ఈ సిరీస్ కోసం లఘు చిత్రాలతో ఆంథాలజీ చిత్రం నిర్మించారు. 2020 లో నూతన సంవత్సరం రోజున విడుదలైంది. ఇది చిత్రనిర్మాతల 2018 సంకలనం లస్ట్ స్టోరీస్ కి ఫాలో-అప్ సిరీస్.

నెట్ ఫ్లిక్స్ ఇండియా గతంలో సేక్రెడ్ గేమ్స్ .. ఏ సూటబుల్ బాయ్ వంటి టైటిల్స్ విష‌యంలో బోలెడ‌న్ని ఎదురుదెబ్బల‌ను తినాల్సి వ‌చ్చింది. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో `ది ఫ్యామిలీ మ్యాన్`.. `తాండవ్` వంటి టైటిల్స్ తో ఇలాంటి సమస్యలను ఎదుర్కొంది.
Tags:    

Similar News