#ఆయ‌నంతేనా? అగ్ర హీరోపై ఒక‌టే గుస‌గుస‌!

Update: 2022-04-18 02:07 GMT
టాలీవుడ్ ని ద‌శాబ్ధాలుగా ఏల్తున్న మాస్ క‌మ‌ర్షియ‌ల్ బాక్సాఫీస్ బాద్ షా ఇప్ప‌టికీ రొటీన్ గా పాత పంథాని అనుస‌రించ‌డం క్రిటిక‌ల్ పాయింట్ ఆఫ్ వ్యూలో విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. జ‌న‌రేష‌న్ మార్పుతో పాటు తాను కూడా మారాల్సి ఉంద‌న్న సూచ‌న‌లు కూడా ఇటీవ‌ల ఎక్కువ‌య్యాయి.

మునుప‌టిలా కంటెంట్ ప‌రంగా క‌మ‌ర్షియ‌ల్ అంశాలు కావాల‌నుకోవ‌డం కానీ.. ప‌బ్లిసిటీ ప‌రంగా పాత అనుక‌ర‌ణ‌ల‌కు వెళ్ల‌డం కానీ స‌రి కాద‌ని సోష‌ల్ మీడియా డిజిట‌ల్ యుగంలో న‌వ్యపంథా ఎలివేష‌న్ తో ముందుకు సాగాల‌ని.. కాలంతో పాటే మారాల‌ని కూడా కొంద‌రు సూచిస్తున్నారు.

త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ లో తండ్రీ కొడుకులు క‌లిసి న‌టించ‌డంతో అభిమానుల్లో బోలెడంత హైప్ నెల‌కొంది. ఒక్కో పాట విడుద‌ల‌వుతుంటే ఫ్యాన్స్ లో సంద‌డి మామూలుగా లేదు. అయితే తండ్రీ కొడుకులు క‌లిసి పాత పంథాలో ఒక వీడియో చేసి ప్ర‌చారం చేయాల‌ని చూడ‌గా క్రిటిక్స్ వైపు నుంచి చిన్న‌పాటి విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. మారిన ట్రెండ్ ని గ్ర‌హించాల‌ని పాజిటివ్ వేలో సూచ‌న‌లు ఉన్నాయి.

అయితే ఇప్ప‌టికీ పాత పంథాలో ఆ వీడియో చేయ‌డం వెన‌క వేరే కార‌ణం ఉంద‌ని కూడా ఇన్ సైడ్ సోర్స్ ద్వారా తెలిసింది. ఇది కేవ‌లం ఫ్యాన్స్ ని సంతుష్టుల్ని చేసేందుకు ఒక వీడియో మాత్ర‌మే. ఇక థియేట‌ర్ల‌కు ర‌ప్పించే కంటెంట్ పరంగా ఎలాంటి డోఖా ఉండ‌ద‌ని స‌ద‌రు అగ్ర హీరో కాంపౌండ్ నుంచి క్లోజ్ సోర్సెస్ చెబుతోంది.

ముఖ్యంగా ద‌ర్శ‌కుడు ఎన్నుకున్న పాయింట్ అల్టిమేట్ గా ఉంటుంద‌ని .. థియేట‌ర్ల‌లో మాస్ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ తో పాటు ఒక ప్ర‌త్యేక‌మైన టింజ్ ఆడియెన్ ని కుర్చీ అంచుకు క‌ట్టేస్తుంద‌ని కూడా  వారు చెబుతున్నారు.

ఇక పాత పంథాలో ప‌బ్లిసిటీ కానీ .. లేదా రొటీన్ మాస్ అంశాలు క‌నిపిస్తున్నా కానీ ప్ర‌ధాన థీమ్ మాత్రం ఫ్యాన్స్ తో పాటు కామ‌న్ ఆడియెన్ ని కూడా థియేట‌ర్ల‌కు ప‌దే ప‌దే ర‌ప్పించేంత గ్రిప్పింగ్ గా ఉంటుంద‌న్న టాక్ కూడా వినిపిస్తోంది. తిన‌బోయి రుచి చూడ‌డ‌మెందుకు..? కేవ‌లం కొద్ది రోజుల్లోనే విడుద‌ల‌కు రెడీ అవుతున్న మ‌ల్టీస్టార‌ర్ థియేట‌ర్ల‌లోనే ప్రూవ్ చేస్తుంద‌ని ధీమాగా చెబుతున్నారు. జ‌స్ట్ వెయిట్ అండ్ సీ.
Tags:    

Similar News