మితంగా ఉన్నంత వరకు బాగుంటుంది. మోతాదు మించితే అంత వరకు అంతవరకు బాగున్నదనుకున్నది కూడా బాగాలేదనిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 5 చూస్తున్న వారికి ఇప్పుడు ఇదే అనుభవం ఎదురవుతుంది. ఎంత ఇష్టమైన స్వీట్ అయినా.. పరిమితికి మించి తిన్న తర్వాత.. తినలేకపోవటమే కాదు.. వెగటు పుట్టిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 5లో సిరి.. షన్నూల తీరు కూడా ఇదే రీతిలో ఉంటోంది. స్వీట్ అండ్ క్యూట్ ఫ్రెండ్ షిప్ గా ఉన్న వీరి రిలేషన్ ను.. బుల్లితెర మీద ఇప్పుడు చూడలేని రీతిలో తయారైంది. ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ విషయానికి వస్తే.. మరే జంట మధ్య లేనంత బ్రహ్మండమైన కెమిస్ట్రీ సిరి - షన్నుతో వర్కువుట్ అయ్యింది.
దీనికి కారణం.. మూడీగా ఉండే అబ్బాయి.. పటాకాలా ఉంటూ ఎప్పుడూ హుషారుగా.. సందడి చేసే ఒక అమ్మాయి. వీరిద్దరి మధ్య స్నేహం మొదలై.. అది కాస్త చిక్కటి.. కమ్మటి కాఫీ మాదిరి వరకు ఓకే. అంతకు మించి అయినా ఫర్లేదు. కాకుంటే.. ఆ అబ్బాయికి ఇప్పటికే ఒక అమ్మాయితో రిలేషన్ షిప్ లో ఉండటం.. ఆ అమ్మాయి ఇప్పటికే ఒక అబ్బాయితో ఎంగేజ్ అయిపోవటం లాంటి టిపికిల్ కండీషన్ ఉంటే?
షన్ను.. సిరి విషయంలో ఇప్పుడు ఇదే ఇబ్బందిగా మారింది. నిజానికి వీరిద్దరూ సింగిల్ గా ఉంటే.. వీరిద్దరి మధ్య మొదలైన రిలేషన్.. అంతకంతకూ పెరిగిపోతున్న వైనం వారిని మాత్రమే కాదు.. వారిని చూస్తున్న ప్రేక్షకులు సైతం ఎమోషనల్ గా ఫీలయ్యేవారు. కానీ.. బిగ్ బాస్ హౌస్ కు మించి బయట వారికో ప్రపంచం ఉంది. వారికంటూ ఉన్న మనుషులు ఇప్పటికే బోలెడన్ని ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఆట ఆడి రండని పంపితే.. రచ్చ రచ్చ చేస్తే ఎలా అన్న భావన కలిగేలా వారి తీరు ఉంది.
ఈ రోజు బిగ్ బాస్ ఫినాలే. ఈ రోజు రాత్రి టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ తో బిగ్ బాస్ సీజన్ 5 విజేత ఎవరో తేలిపోతోంది. ఇప్పటికే.. ఈ సీజన్ విజేత ఫలానా అంటూ ఒకరిద్దరి పేర్లు సోషల్ మీడియాలో వస్తుంటే.. అదేమీ కాదు.. విజేత సన్నీనే అంటూ వార్తలు రావటం.. దానికి ఆధారం తమకు అందుతున్న లీకులే అని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితికి.. సన్నీకి గట్టి పోటీని ఇచ్చిన షన్నూ.. చివర్లో సిరి విషయంలో వ్యవహరించిన తీరు ఇబ్బందికరంగానే కాదు.. చాలామంది అతగాడి ఫ్యాన్స్ కు సైతం చిరాకు పుట్టేలా చేసిందంటున్నారు.
ఎక్కడిదాకానో ఎందుకు.. ఈ సీజన్ ముగియటానికి ఒక రోజు ముందు.. అంటే శనివారం టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ కు సంబంధించిన అన్ సీన్ ఎపిసోడ్ లో బాత్రూం దగ్గర వారు చేసిన రచ్చ చూస్తే.. రియల్ కపుల్ కూడా ఇంత ఘాటు రొమాన్సు ఉండదన్న భావన కలుగక మానదు. బాత్రూం దగ్గర.. సిరిని వెనుక నుంచి గట్టిగా హత్తుకున్న షన్నూ.. ఆమె ఎంత అడిగినా వదలకపోవటం.. రెడీ కావాలని చెప్పినా.. ఏదో గారం చేస్తూ.. హత్తుకొని ఉండటమే తప్పించి.. విడిచిపెట్టని తీరు చూస్తున్న ప్రేక్షకులకు ఇరిటేట్ అయ్యేలా వారిద్దరి ప్రవర్తన ఉందని చెప్పాలి.
ఆ మాటకు వస్తే.. శుక్రవారం టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో.. సిరిని ఉన్నట్లుండి హౌస్ నుంచి బయటకు రావాలన్న బిగ్ బాస్ ఆదేశం.. ఆ సందర్భంగా సిరి.. షన్నూల మధ్య నడిచిన హగ్గులు మోతాదు మించిపోయాయి. పిల్లలతో కలిసి చూసే వారికి ఈ సీన్లు పంటి కింద రాయిలా మారతాయి. అంతేనా.. సిరి హౌస్ నుంచి వెళ్లి.. మరికాసేపటికే వెనక్కి వచ్చిన సందర్భంగా వారిద్దరి మధ్య నడిచిన రొమాన్సు.. చిరాకు పుట్టించేలా మారింది. వీరిద్దరి మధ్యన ఉన్నది మంచి ఫ్రెండ్ షిప్పేనని హౌస్ మేట్స్ మొన్నటివరకు చెప్పేవారు. కానీ.. ఈ వారం ఎపిసోడ్ లను చూసినప్పుడు వీరిద్దరి మధ్య అంతకు మించి అన్న విషయాన్ని.. అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ ప్రస్తావించటం గమనార్హం.
ఎక్కడిదాకానో ఎందుకు.. శుక్రవారం ఎపిసోడ్ లో సిరి హౌస్ నుంచి వెళ్లిపోవాలని బిగ్ బాస్ ఆదేశించిన వేళ.. సిరి వెళ్లిపోతూ.. తలుపు మూసుకునే వేళలో.. ఐలవ్యూ అని చెప్పటం.. ఆ తర్వాత మాట్లాడుకున్న మానస్.. సన్నీలు.. సిరి చెప్పిన ఐలవ్యూ గురించి ప్రస్తావించటం కనిపిస్తుంది. చాలా పెద్ద మాట అన్నది చూశావా అంటూ సన్నీ మాట్లాడతారు. బయట వేరే వారితో స్ట్రాంగ్ రిలేషన్ లో ఉన్న ఇద్దరు.. బిగ్ బాస్ హౌస్ లో వంద రోజుల ప్రయాణంలో ఒకరినొకరు.. వారు అప్పటికే రిలేషన్ లో ఉన్న వారికి హ్యాండ్ ఇచ్చేలా వ్యవహరించటం దేనికి సంకేతం? మిగిలిన విషయాలు ఎలా ఉన్నప్పటికీ.. కొన్ని విషయాల్లో గీత దాటకూడదు.
ఆ విషయంలో సిరి.. షణ్నూలు అన్ని గీతలు దాటేసిన వైనం గడిచిన నాలుగైదు రోజులుగా నడుస్తున్న ఎపిసోడ్ లను చూస్తే.. అర్థమవుతుంది. శనివారం టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ ను చూస్తే.. షణ్నూ.. సిరిలు ఇద్దరు ఒకే బెడ్ మీద పడుకోవటం కనిపిస్తుంది. హౌస్ మొత్తం ఖాళీగా ఉన్నప్పుడు.. అప్పటికే వారి మధ్యన నడుస్తున్న హగ్గుల భాగోతాన్ని సిరి తల్లి ప్రశ్నించి.. నాకు నచ్చట్లేదని ఓపెన్ గా చెప్పేసిన తర్వాత సిరి ఇలా వ్యవహరించటమా? ఆ మధ్యన సిరి ఫియాన్సీ.. నీకోసం బయట ఉన్నానే.. అంటూ ఎమోషన్ గా మాట్లాడినప్పుడు.. ఏడ్చేసిన సిరి.. ఆ తర్వాత అయినా కాస్త మారితే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా.. స్వీట్ గా.. క్యూట్ గా మొదలైన వీరిద్దరి స్నేహం.. ఇప్పుడు సగటు ప్రేక్షకుడు భరించలేనంత వెగటుగా మారటం.. వారిద్దరు చేజేతులారా చేసుకున్నదే తప్పించి.. ఇంకేం కాదు.