గ్లోబల్ సుందరి ప్రియాంక చోప్రాకు ఈమధ్య ఏమైందో కానీ ఆమె వేసుకునే డ్రెస్సులు సరిగా ఉండడం లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మెట్ గాలా దగ్గర నుంచి ప్రియాంకపై ట్రోలింగ్ ఓ రేంజ్ లో జరుగుతోంది. మెట్ గాలా థీమ్ పేరుతో వేసుకున్న పిచ్చ డ్రెస్.. దాని తర్వాత బ్లౌజ్ లేకుండా అడ్డదిడ్డంగా కట్టిన చీర .. ఇలా కనీసం ఒక అర డజను సార్లు ప్రియాంక డ్రస్సులు ట్రోలింగుకు గురయ్యాయి. తాజాగా మరోసారి అదే జరిగింది.
రీసెంట్ గా ప్రియాంక నేవీ బ్లూ టాప్.. అదే రంగు బ్లేజర్ తో పాటు మ్యాచింగ్ గా ఓ ఖాకీ నిక్కర్ ధరించింది. అంతే.. సోషల్ మీడియాలో రచ్చ షురూ అయిపోయింది. ఒకరు "ఆరెస్సెస్ లో హై లెవెల్ మీటింగ్ నుంచి బైటకు వస్తూ ప్రియాంక" అంటూ సెటైర్ వేయగా మరొకరు "ఆరెసెస్ కు అంతర్జాతీయ బ్రాండ్ అంబాజిడర్" అని.. ఇంకొకరు "బ్రేకింగ్ న్యూస్.. ప్రియాంక ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అయింది" కామెంట్లు గుప్పించారు.
ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఖాకీ నిక్కర్ ఇప్పుడు ఆరెస్సెస్ యూనిఫాం కాదు. 2016 లోనే వారు ఖాకీ నిక్కర్ స్థానంలో బ్రౌన్ ప్యాంట్ ను యూనిఫాం గా తీసుకొచ్చారు. కానీ జనాల్లో మాత్రం ఖాకీ నిక్కర్ అంటే ఇంకా ఆరెస్సెస్ యూనిఫాం అనే అభిప్రాయమే ఉంది. ఆరెస్సెస్ యూనిఫామ్ సంగతేమో కానీ ప్రియాంక స్టైల్ మాత్రం ఈమధ్య దెబ్బ తిన్నట్టు అనిపిస్తోంది. ఆ స్టైలిస్ట్ ఎవరో కానీ ఏరికోరి జఫ్ఫా డ్రెస్సులు డిజైన్ చేస్తున్నారు. ప్రియాంక వాటిలో ది బెస్ట్ జఫ్ఫా దుస్తులను ఎంచుకుంటోంది. ఇది ఇప్పట్లో ఆగేలా లేదు.