అందాలతో అలరించే బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తొలిసారిగా నటించిన "మిసెస్ సీరియల్ కిల్లర్" వెబ్ సిరీస్ ఎన్నో అంచనాల మధ్య విడుదలై అట్టర్ ఫ్లాప్ అయింది. జాక్వెలిన్ హొయలు, మనోజ్ బాజ్‌పాయి నటన ఈ సిరీస్ కి ఉపయోగ పడలేదు. మొదటి నుండి చివరివరకు ఎందుకు చూస్తున్నాం.. అనే ఫీల్ కలిగిస్తుంది. కానీ అప్పటికే కథ కథనంలో బలం లేకపోవడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అక్షయ్ కుమార్‌కు "జోకర్" సినిమాతో డిజాస్టర్ అందించిన శిరీష్ కుందర్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించి మరోసారి డిజాస్టర్ అందుకున్నాడు.
కథ పరంగా.. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన మహిళలు దారుణంగా హింసకు గురవుతూ చనిపోతుంటారు. దీనికి డా. మృత్యుంజయ్ ముఖర్జీ (మనోజ్ బాజ్‌పాయ్) కారణమని పోలీసులు భావిస్తారు. దీంతో మర్డర్ కేస్‌లో చిక్కుకున్న భర్త మృత్యుంజయ్‌ను కాపాడటం కోసం అతని భార్య సోనా ముఖర్జీ(జాక్వెలిన్ ఫెర్నాండేజ్) బయలు దేరుతుంది. సీరియల్ కిల్లర్ తరహాలో మరో హత్య చేసి భర్తను కాపాడుకుంటుంది. ఇదే కథ. అయితే ఈ సిరీస్‌లో కొన్ని సంఘటనలు అర్థం లేనివిగా మిగిలిపోతాయి.
ఇక ఈ సిరీస్‌ను రూపొందించినందుకు నెట్‌ఫ్లిక్స్‌పై ప్రేక్షకులు బూతుల వర్షం కురిపిస్తున్నారు. చెత్త కంటెంట్ ఉన్న సినిమా అని బూతులు అందుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. అసలు జాతీయ అవార్డు గ్రహీత మనోజ్ బాజ్‌పాయ్ ఈ సిరీస్ ఎలా ఓకే చేసారు అనేది అందరి సందేహం. కెరీర్‌లో కాస్త స్లో అయిన మనోజ్ 'ది ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. తను కొత్తగా నటించిన నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ 'మిసెస్ సీరియల్ కిల్లర్' పై చాలా ఆశలే పెట్టుకున్నారు. వెబ్ సిరీస్ బోల్తా కొట్టడంతో చాలా మంది మనోజ్ ను ఈ సిరీస్ ఎలా ఒప్పుకున్నావ్? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇందులో ఆయన నటన ప్రదర్శించడానికి అసలు స్కోప్ లేదని అంటున్నారు.