'నార‌ప్ప‌'ని అవ‌తార్ -2 డైరెక్ట‌ర్ కి చూపించేలా ఉన్నారే!

Update: 2022-12-17 05:59 GMT
జెమ్స్ కామోరూన్ విజువ‌ల్ 'అవ‌తార్ -2 దివే ఆఫ్ వాట‌ర్' వ‌ర‌ల్డ్ వైడ్ గా నిన్న రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. 13 ఏళ్ల త‌ర్వాత కామెరూన్ దృశ్య‌రూపం ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డంతో? అంద‌రి ఎగ్జైట్ మెంట్ కి తెర‌పడింది. ఇక సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ స‌హా ఇండియాలోనూ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. నిడివి ప‌రంగా మ‌నోళ్లు విమ‌ర్శ‌లు చేస్తున్న‌ప్ప‌టికీ పెట్టిన డ‌బ్బుకి మించి గొప్ప అనుభూతిని పంచార‌నే తెలుస్తోంది.

ఇలాంటి సినిమాలు చేయాలంటే అదృష్టం కాదు..చూడాలంటే అదృష్టం ఉండాలి. ఆ ర‌కంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్ష‌కులు అదృష్టం చేసుకుంటునే ఇలాంటి వండర్స్ వ‌స్తాయ‌ని చెప్పాలి. హాలీవుడ్ లో  జెమ్స్ కామోరూన్ ఒక్క‌డే ద‌ర్శ‌కుడా? అత‌ను త‌ప్ప ఇంక ద‌ర్శ‌కులే లేరా? ఉంటే వాళ్లెందుకు ఇలాంటి గొప్ప సినిమాలు చేయ‌లేక‌పోతున్నారు! అన్న‌ది విమ‌ర్శ‌కులకే వ‌దిలేయాలి.

అయినా స‌రే మేమంతా  కెమెరూన్ అవ‌తార్ -3 కోసం వెయిట్ చేస్తున్నామంటున్నారంటే? అదంతా  కెమోరూన్ గొప్ప‌త‌నం కాక మ‌రేంటి? ఆ సంగ‌తి ప‌క్కన బెడితే తెలుగు సినీ ప్రేక్ష‌క నెటిజ‌నులు సోష‌ల్ మీడియా వేదిక‌గా అవ‌తార్ -2ని నార‌ప్ప సినిమాతో పోల్చుతున్నారు.

'నార‌ప్ప' త‌న కుటుంబాన్ని కాపాడుకోవ‌డానికి ఎంత దూర‌మైనా వెళ్లే ఒక ఓ తండ్రి. ఈ క్ర‌మంలో శ‌త్రువుల దాడిలో ఒక కొడుకును కోల్పోతే నార‌ప్ప శ‌ర‌మ శంఖం  ఎలా  పూరించాడు అన్న‌ది నారప్ప క‌థ‌.  మిగ‌తా కుటుంబాన్ని కాపాడుకోవ‌డానికి నార‌ప్ప ప్ర‌త్య‌ర్ధుల‌తో ఎలా పోరాడాడు అన్న‌ది నెటివిటీకి త‌గ్గ‌ట్టు తీసారు. ఇప్పుడు రిలీజ్  అయిన  అవ‌తార్-2 క‌థ కూడా అలాగే ఉంట‌దంటున్నారు నెటి జ‌నులు. ఇలా క‌థ ప‌రంగా పోలిక యాదృశ్చ‌క‌మే అయినా మిగ‌తా క‌థ వేరేలా ఉంద‌న్న‌ది తెలిసిందే. ఆ  క‌థ‌ని  ఉద్దేశించే కెమెరూన్  సినిమా  కాపీ కొట్టాడంటూ స‌ర‌దాగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. మ‌రి నార‌ప్పని కామెరూన్ చూస్తే బావుండేది.

అవ‌తార్ రిలీజ్ అనంత‌రం ఇలాంటి పొలిక‌లు తెర‌పైకి వ‌చ్చాయి. 'వియ‌త్నాం కాల‌నీ' అనే సినిమా  క‌థ‌ని అవ‌తార్ క‌థ పోలింద‌ని అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి. ఇది మోహ‌న్ లాల్ హీరోగా న‌టించిన మ‌ల‌యాళ మూవీ. ఓ  కాల‌నీ వాసుల‌ను ఖాళీ చేయించ‌డానికి విల‌న్ బ్యాచ్ హీరోను అక్క‌డికి పంప‌డం. ఆ త‌ర్వాత వాళ్ల‌లో క‌లిసిపోయి విల‌న్ బ్యాచ్‌ను ఎదిరించ‌డం  నేప‌థ్యంలో క‌థ సాగుతుంది.

అవ‌తార్ పండోరా గ్ర‌హం నేప‌థ్యంలో సాగే స్టోరీ. ఆ గ్ర‌హం మీద‌కి వెళ్లిన మాన‌వాళిని న‌విజాతి తెగ ఎలా అంతం మొందించ‌న్న‌ది క‌థ. ఇలాంటి పోలిక‌లు స‌హ‌జ‌మే. సోల్ క‌నెక్ట్ అవుతుంది. అయినా ఓ హాలీవుడ్ సినిమా తెల‌గు సినిమా త‌ర‌హా ఎమోష‌న్  తీసుకోవ‌డం అన్న‌ది  విశేషంగానే భావించాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News