చిరుపై పోలికల వర్షం

Update: 2018-03-30 10:22 GMT
నిన్న సోషల్ మీడియాలో సైరా లీక్డ్  పిక్స్ ట్యాగ్ తో అమితాబ్-చిరు-నయనతార ఉన్న వర్కింగ్ స్టిల్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదన్న సంగతి తెలిసిందే. తన సినిమాలకు సంబంధించి రెగ్యులర్ అప్ డేట్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేయకుండా ఉండలేని అమితాబ్ బచ్చన్ తో పాటు ఇవి ఉపాసన కూడా షేర్ చేసుకోవడంతో క్షణాల్లో వైరల్ అయిపోయాయి. నిజానికి ఇవి దొంగచాటుగా తీసినట్టు లేవే అని లాజిక్ కొందరు ప్రశ్నించినా మొదటి సారి చిరు లుక్ ఎలా ఉందో చూసే ఉత్సాహంలో అదెవరు పట్టించుకోలేదు.ఫాన్స్ కళ్ళు మాత్రం చిరు గెటప్ మీద హెయిర్ స్టైల్ మీద ఫోకస్ పెంచాయి. ఆ రూపు రేఖలు కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన తీరు కొందరికి బాహుబలిలో అమరేంద్రను గుర్తుకుతెస్తుండగా మరికొందరికి చాలా ఏళ్ళ క్రితం ఆగిపోయిన చిరంజీవి హాలీవుడ్ మూవీ అబు బాగ్దాద్ గజదొంగ లాగా అనిపించింది. మొత్తానికి సైరా అఫీషియల్ లుక్ విడుదల చేయక ముందే ఎలా ఉంటాడో క్లారిటీ వచ్చేసింది.

రాజగురువు స్థానంలో అమితాబ్ గంభీరంగా కూర్చుని ఉండగా చిరు-నయనతార కలిసి ఏదో యాగాన్ని చేయిస్తున్నట్టు అందులో స్పష్టంగా కనిపించింది. సరిగ్గా ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ మొదలు పెట్టిన రోజు దుర్యోధనుడి గెటప్ లో బాలయ్య ఫోటోలు ఆన్ లైన్ లో వైరల్ అవుతున్న సమయంలోనే ఇవి కూడా బయటికి రావడం కాకతాళీయమో లేక స్ట్రాటజీ ప్రకారం ప్రేక్షకుల దృష్టిని సైరా వైపు కూడా మళ్లేలా చేయటమో తెలియదు కాని ఇలా లుక్స్ విషయంలో కూడా ఈ ఇద్దరు సమఉజ్జీలు ఒకే రోజు పోటీ పడటం విశేషమే. సైరా షూటింగ్ స్పీడందుకుంది. అమితాబ్ ఈ వారం తన కాల్ షీట్ పూర్తి చేసుకుని వెళ్ళిన తర్వాత మళ్ళి ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ ఉంటుందా లేక ఈ యాగం ఎపిసోడ్ తో పూర్తవుతుందా అనేది తెలియాల్సి ఉంది.

 సైరా షూటింగ్ పూర్తవ్వడం గురించి విడుదల గురించి ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. ఎంత ఫాస్ట్ పేస్ తో చేసినా వచ్చే సంక్రాంతికి కష్టమే అనిపిస్తోంది. సో వేసవిని టార్గెట్ చేసుకునే సైరా ని దానికి తగ్గట్టు ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు లీక్ అయిన గెటప్ సినిమా మొత్తం ఉండదని, తిరుగుబాటు వీరుడిగా ఊహించని గెటప్ లో చిరు థ్రిల్ చేస్తారని ఇన్ సైడ్ టాక్.
Tags:    

Similar News