కమెడియన్ కు నెటిజన్స్ కౌంటర్

Update: 2018-05-04 06:44 GMT
అప్పట్లో ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు శంకర్ ఒక కమెడియన్ ని బాగా వాడేవారు గుర్తుందా. బాయ్స్ - అపరిచితుడు - శివాజీ వంటి సినిమాల్లో తన నటనతో నవ్వించి ఆకట్టుకున్న వివేక్ గురించి అందరికి ఒక ఐడియా ఉండే ఉంటుంది. తెలుగు ఆడియెన్స్ కి కూడా బాగా కనెక్ట్ అయిన ఈ కమెడియన్ తెలిసి చేస్తాడో తెలియక చేస్తాడో గాని అప్పుడపుడు సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను తెలియజేస్తూ వివాదాలను రేపుతుంటాడు.

వివేక్ ఇటీవల విద్యార్థుల గురించి ఒక మంచి ట్వీట్ వేశాడు అని మొదట చదివేలోపే నెగిటివ్ గా అనిపించడంతో అందరు విమర్శలను కురిపిస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ గురించి ప్రస్తావిస్తూ ఈ విధంగా ట్వీటేశారు.. డియర్ స్టూటెంట్స్ ! సమ్మర్ హాలిడేస్ ని బాగా ఎంజాయ్ చేయండి. అంతే కాకుండా ఆటలాడిన తరువాత వాటర్ బాగా తాగాలి. అమ్మాయిలు వంట గదిలో అమ్మకు అప్పుడపుడు సహాయం చేయండి. వీలైతే నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇక మగవారు తండ్రి చేసే పని దగ్గరికి వెళ్లి ఆయన మన కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నారు ఏం చేస్తున్నారు అనేది చూసి గ్రహించండి. బలంగా ఉండండి అని ట్వీట్ వివేక్ ట్వీట్ చేశాడు.

దీంతో ఆయన ట్వీట్ పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా మహిళలైతే వివేక్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆడపిల్లలు వంటింటికే పరిమితం కావాలని అనుకుంటున్నారా? మహిళలు వంటిట్లో ఉండి వంట నేర్చుకోవాలి అనడం ఎంతవరకు కరెక్ట్. ఏ? మగవారు నేర్చుకోకూడదా?. తండ్రి వెంట ఆడపిల్ల వెళితే తప్పేమిటి అంటూ.. లింగా బేధాలు ఆపండి అని నెటిజన్స్ ఈ స్టార్ కమెడియన్ కు కౌంటర్ ఇచ్చారు.


Tags:    

Similar News