నటసింహా నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను `అఖండ`తో హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు. `సింహా`..`లెజెండ్` తర్వాత `అఖండ`తో ఈ కాంబినేషన్ కి ఎదురేలేదన్నది ప్రూవైంది. ఇప్పుడు ఈ కలయిక అంటే అంచనాలు మరింత బలపడ్డాయి. ఇక `అఖండ`లో బాలయ్య ద్విపాత్రాభినయం ఆకట్టుకుంది. ముఖ్యంగా అఖండ రోల్ ఆద్యంతం అలరించింది.
అఖండ కనిపించే ప్రతీ సన్నివేశం ఎంతో అద్భుతంగా పండిందని ప్రశంసలు దక్కాయి. మేకర్స్ ఊహించిన దానికంటే గొప్ప రెస్పాన్స్ `అఖండ` రోల్ కి వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అఖండ పంచ్ లు.. యాక్షన్ సన్నివేశాల గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు.
అఖండ ఎంట్రీ నుంచి ఎండింగ్ వరకూ ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఆ రోల్ సాగుతుంది. అంత గొప్పగా ఆ పాత్రని బోయపాటి తెరపై ఆవిష్కరించారు. బోయపాటి క్రియేటివిటీని మించి రోల్ ప్రస్థానం సాగిందా? అనిపిస్తుంది. అఖండ పాత్రని ఎంతో బ్యాలెన్సింగ్ గా సెటిల్డ్ గా డిజైన్ చేసి బోయపాటి పెద్ద సక్సెస్ అయ్యారు. ఇందులో ఓ యాక్షన్ సీన్ గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది.
సెకండాఫ్ క్లైమాక్స్ లో బాలయ్య రథచక్రం పట్టుకుని పైకి ఎత్తి ప్రత్యర్ధుల భరతం పడతారు. ఆ సీన్ చూస్తున్నప్పుడు నెక్స్ట్ లెవల్ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ అయింది. రథ చక్రాన్ని గిరగిరా తిప్పుతూ రుద్ర తాండవం చేసే పరమశివుడిలా ప్రజెంట్ చేయడం అందరినీ ఆకట్టుకుంది.
అభిమానులకు కొత్త అనుభూతినిచ్చింది. బోయపాటి విజువలైజేషన్ రియల్లీ గ్రేట్ అనిపించింది. కొన్ని హాలీవుడ్ సినిమాల ప్రభావం బోయపాటి మీద ఉన్నప్పటికీ వాటిని తెలుగులోకి తర్జుమా చేయడం కూడా ఓ ట్యాలెంట్ అనే చెప్పాలి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు బోయపాటి స్వయంగా డిజైన్ చేస్తారు. ఈసారీ అతడు ఫెయిల్ కాలేదు.
బాలయ్యకు యాప్ట్ గా వాటన్నిటినీ డిజైన్ చేసి నిరూపించారు. అలాగే ఆయన సినిమాల్లో విలన్లు అంత బలంగా పవర్ ఫుల్ గా కనిపిస్తారు. వారితో హీరో ఢీ అంటే ఢీ అనే సన్నివేశాలు వర్కవుటయ్యాయి. ఈ కాంబినేషన్ లో ఇంకా మరెన్నో చిత్రాలు తెరకెక్కడం ఖాయమని ఇప్పుడు మరోసారి ప్రూవ్ అయ్యింది.