మరోసారి మనసులు గెలిచిన స్టార్ హీరో..!

Update: 2021-03-11 12:15 GMT
తమిళ స్టార్ హీరో సూర్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా సూర్య తన డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అలాగే తెలుగు రాష్ట్రాలలో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. గజినీ సినిమా నుండి ఇటీవలి 'ఆకాశం నీ హద్దురా' సినిమా వరకు సూర్య నుండి సినిమాలు వస్తూనే ఉన్నాయి. సూర్య నటించే ప్రతి సినిమా తెలుగులో డబ్ చేస్తూనే ఉంటారు మేకర్స్. అలాగే సూర్య కూడా తెలుగు చాలా బాగా మాట్లాడతాడు. అప్పుడప్పుడు తెలుగు సినిమా ఈవెంట్స్ లో కనిపిస్తుంటాడు. అయితే సూర్య అగరం ఫౌండేషన్ ద్వారా పేదలకు, పేద విద్యార్థులకు సాయం చేస్తాడనే సంగతి తెలిసిందే.

ఆ విధంగా పేదలకు సహాయం చేస్తూనే సూర్య జనాల మనసులో స్థానం సంపాదించుకున్నాడు. అయితే తాజాగా ‘ప్రపంచ కిడ్నీ దినోత్సవం’ సందర్బంగా.. సూర్య మరోసారి అందరూ తనను ప్రశంసించే నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నవారికి మద్దతుగా నిలుస్తూ.. అలాగే వారి జీవితాలను పూర్తిగా మాములుగా మార్చేందుకు సాయం చేసేందుకు సూర్య టాంకర్ ఇండియా ఫౌండేషన్‌తో చేతులు కలిపాడు. ఈ వార్త దేశవ్యాప్తంగా సూర్య పై గౌరవాన్ని పెంచిందనే చెప్పాలి. ఎంతోమంది సూర్యకు మద్దతుగా నిలుస్తూనే భావోద్వేగంతో సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సూర్య పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
Tags:    

Similar News