మాట‌లేనా చేత‌ల‌తోను మాయ చేయ‌గ‌ల నేర్ప‌రి

Update: 2022-01-04 12:30 GMT
హాట్ బ్యూటీ ర‌ష్మిక మంద‌న ఇటీవ‌లే `పుష్ప `తో తొలి పాన్ ఇండియా స‌క్సెస్ ని ఖాతాలో వేసుకుంది. ఈ బ్యూటీ `సామీ సామీ `అంటూ అంద‌ర్ని క‌ట్టిప‌డేస్తోంది. వేదిక ఏదైనా `సామీ స్టెప్` వేసి బుట్ట‌లో వేసేస్తోంది. సొగ‌స‌రి భామ ర‌ష్మిక‌ బేసిక్ గానే చ‌లాకీ గాళ్. ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. మాట‌ల‌తో..చేత‌ల‌తో మాయ చేయ‌గ‌ల నేర్ప‌రి. సామీ సామీ అంటూ ఇంకా ముంచేస్తోంది. ఇప్పుడు ర‌ష్మిక నేష‌న‌ల్ క్ర‌ష్ గా వెలిగిపోతోంది. తాజాగా ర‌ష్మిక కొత్త ఫోటోలు కొన్ని ఇన్ స్టాలో వైర‌ల్ గా మారాయి. అత్యంత ఆక‌ర్ష‌ణీయ‌మైన భంగిమ‌లో కెమెరాకి ఫోజులిచ్చింది.

స్కిన్ టైట్ బ్లౌజు..తెలుపు రంగు ప్యాంటు ధ‌రించి.. వీపు బాగాన్ని ఆవిష్క‌రించేలా.. స‌రికొత్త‌ యాంగిల్ లో కెమెరాకి ఫోజులిచ్చింది. ర‌ష్మిక హాట్ ఫోజు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ ఫోటోని ఉద్దేశించి ర‌ష్మిక ఓ కామెంట్ కూడా చేసింది. వివిధ ర‌కాలైన భంగ‌మ‌ల‌ను ప్ర‌య‌త్నించ‌డం.. ఇది ప‌నిచేస్తుందా? అని మ‌ధ్య‌లో ఓ కామిక్ ఎమోజీని పోస్ట్ చేసింది. ఆనంద్ దేవ‌ర‌కొండ ఇది `ప‌ని` అని వ్యాఖ్యానించ‌గా ర‌ష్మిక ఫాలోవ‌ర్స్ షాక్ అయ్యారు.

ర‌ష్మిక బాగా ఫోజులిచ్చిందా? లేదా? అని అడ‌గాల‌నుకుంటున్నారా? ఆ ఇంపాక్ట్ వ‌ర్కౌట్ అవుతుందా? వంటి ప్ర‌శ్న‌లు రెయిజ్ అయ్యాయి. ముంబైకి చెందిన యువ ఫ్యాష‌నిస్ట్ ర‌ష్మిక‌ని ఆ ర‌కంగా డైరెక్ట్ చేసిన‌ట్లు రివీల్ చేసారు. అలాగే ర‌ష్మిక కాదు...`క్ర‌ష్మిక` అని మ‌రో ట్యాగ్ కూడా ప‌డింది. క్రష్మిక ఇంపాక్ట్ కొన్ని సంవ‌త్స‌రాలు పాటు గుర్తిండిపోతుంద‌ని కామెంట్లు ప‌డుతున్నాయి. ర‌ష్మిక సినిమాల విష‌యానికి వ‌స్తే బాలీవుడ్ లో `మిష‌న్ మ‌జ్ను`..`గుడ్ బై` చిత్రాల్లో న‌టిస్తోంది. తెలుగులోనూ కొన్ని క‌మిట్ మెంట్లు ఉన్నాయి.


Tags:    

Similar News