ఒక మంచి అంతలోనే చెడుగా మారింది! ఒక మంచి వాడు ఇంతలోనే చెడ్డవాడిగా మారిపోయాడు. ఒక రియల్ హీరో స్కామ్ స్టర్ అయ్యాడు. భారతదేశంలో ఎప్పుడు ఏది ఎలా అయినా మారిపోతుంది? అనడానికి ఇదే ఎగ్జాంపుల్. సమాజంలోని బడుగు బలహీన పేద వర్గాల ప్రజలతో పాటు ఉన్నతమైన వారు కూడా `బ్రదర్ ఆఫ్ ది నేషన్` అనే ట్యాగ్ తో నటుడు సోను సూద్ ని ప్రశంసించారు. కానీ అతడు ఇప్పుడు తన గుర్తింపును చాలా తక్కువ వ్యవధిలోనే కోల్పోయాడు. ఇటీవల ముంబైలోని సోనూసూద్ నివాసం కార్యాలయాలపై ఆదాయపు పన్ను దాడులు జరిగాక పరిణామమిది. అతడు పన్ను ఎగవేసినట్లు అధికారులు నిర్ధారించారు. 20 కోట్ల పన్ను ఎగవేసాడని.. అతను తన ఫౌండేషన్ ద్వారా సేకరించిన మొత్తం 18 కోట్లలో 1.9 కోట్లు మాత్రమే ఖర్చు చేశాడని కూడా వారు పేర్కొన్నారు. ఇది సోను సూద్ ఇమేజ్ కి హఠాత్తుగా నష్టం కలిగించింది.
ఐటీ దాడి జరిగే వరకు ప్రతిఒక్కరి నుంచి సోను చాలా గౌరవం అందుకున్నాడు. ఇంతలోనే గౌరవాన్ని కాకెత్తుకెళ్లింది. అతడు స్కామ్ సూద్ అంటూ విమర్శిస్తున్నారు. భారతదేశంలో లాక్ డౌన్ సమయంలో ఆ తరువాత సోను సూద్ చేసిన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు ముఖ్యమంత్రులు.. ప్రభుత్వ మంత్రులు సహా ఎందరో ప్రశంసలు కురిపించారు. నష్టాన్ని నియంత్రించడానికి సోను సూద్ ఒక ప్రకటనను విడుదల చేశారు. ``మీరు ఎల్లప్పుడూ మీ వైపు కథ చెప్పనవసరం లేదు. సమయం వస్తుంది`` అని సోనూ సూద్ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం సోనూ సూద్ విమర్శకులు #Scam Sood అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ట్వీట్లు మీమ్ లను పోస్ట్ చేస్తున్నారు. అత్యధిక సంఖ్యలో పోస్ట్ లు ట్రెండింగ్ లో ఉన్నాయి. సోనూసూద్ ఇమేజ్ కి ఇది ఎంతో కొంత డ్యామేజీ కిందే లెక్క.