మన్మథుడు 2: అమల గారికి తగిలిన హీటు!

Update: 2019-08-11 01:30 GMT
అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్న తరహాలో  ఇప్పుడు 'మన్మథుడు 2' టీమ్ ఉంది.  బోల్డ్.. అడల్ట్ కంటెంట్ ఇప్పుడు ట్రెండింగ్ అనుకున్నారేమో కానీ అదే సినిమాకు నెగెటివ్ గా మారింది. చాలామంది నెటిజన్లు సినిమాపై దుమ్మెత్తిపొస్తున్నారు.  చివరికి ఈ హీట్ నాగార్జున సతీమణి అమల గారికి తగలడం గమనార్హం.

అన్నపూర్ణ స్టూడియోస్ ట్విట్టర్ హ్యాండిల్ లో  "ఈ వారంతంలో 'ఫన్'టాస్టిక్ బ్రీజీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మన్మథుడు 2' ను మీ దగ్గరలోని థియేటర్లలో చూడండి' అంటూ   ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ నాగార్జున సతీమణి అమల "నవ్వి నవ్వి సీట్ నుంచి పడిపోయా. సినిమాతో లవ్ లో పడిపోయా.  పూర్తిగా న్యూ ఏజ్.. ఫిలిం.. అవుట్ రేజియస్ లీ బ్యూటీఫుల్ #మన్మథుడు2" అని తన అభిప్రాయం తెలిపారు. ఇక చూసుకోండి...  నెటిజన్లు సెటైర్లతో.. పంచ్ లతో రచ్చ చేశారు.  

అమల గారి ట్వీట్ కు వచ్చిన రెస్పాన్సులలో ఇవి కొన్ని..

*చాలామంది స్ప్రహ తప్పారు.. మీరు గమనించలేదా మేడమ్

*అమల అక్కినేని గారు ఇంకా పూర్తిగా తెలుగు నేర్చుకున్నట్టు లేదు. సినిమా అంతా అడల్ట్ కంటెంటే. ఇదెలా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది?

*మీరు చూసింది త్రివిక్రమ్ మన్మథుడు అనుకుంటా మేడమ్ గారు.

*మేడమ్.. మూవీ నచ్చలేదు.  అసలు చూడలేకపోయాం. మన్మథుడు 2 టైటిల్ అసలు సెట్ కాలేదు. కనీసం టైటిల్ మార్చండి.. లేకపోతే హై ఎక్స్ పెక్టేషన్స్ తో వెళ్తారు.

ఇంకొన్ని కామెంట్లు ఘాటుగా ఉన్నాయి కాబట్టి వాటిని ఇక్కడ రాయడం లేదు.  ఒక నెటిజన్ మాత్రం "మేడమ్.. సార్ ను మంచి సినిమాలు తీయమని చెప్పండి" అంటూ విన్నవించుకున్నాడు.


Tags:    

Similar News