మా కడుపు కొట్టొద్దంటూ రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే.. వారిని ఉగ్రవాదులు అంటూ నోరు పారేసుకుంది బాలీవుడ్ నటి కంగనా రనౌత్. మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ముఖ్యమంత్రిపై అందరూ ఆగ్రహం వ్యక్తంచేస్తే.. ఈమె మాత్రం వెనకేసుకొచ్చారు. మహారాష్ట్ర సర్కారుతో జరిగిన గొడవ సందర్భంలో ఏకంగా వై సెక్యూరిటీ కల్పించింది బీజేపీ ప్రభుత్వం. గతంలో పలుమార్లు మోడీపై, ఆయన పాలనపై ప్రశంసలు కురిపించారు కంగనా.
ఈ విధంగా బీజేపీతో ఆమె బంధం పరోక్షంగా కొనసాగుతోందనే అభిప్రాయం ఎప్పటి నుంచో వ్యక్తమవుతోంది. రైతు ఉద్యమం నేపథ్యంలో అది మరింత సుస్పష్టమైంది. అయితే.. కంగనా రనౌత్ బీజేపీతో కలిసి పనిచేయడంపై ఎవరికీ అభ్యంతరం లేదు. ఉండదు కూడా. ఎవరి ఇష్టం వచ్చిన పార్టీలోకి వాళ్లు వెళ్తారు. కానీ.. అవార్డులు, రివార్డులు ఇప్పించుకోవడం, గొప్ప నటిగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి అధికారాన్ని వాడుకుంటే మాత్రం అభ్యంతరం చెబుతాం అంటున్నారు నెటిజన్లు.
ఈ ఏడాది ప్రకటించిన జాతీయ అవార్డుల్లో కంగనాకు ఉత్తమ నటి అవార్డు రావడం వివాదాస్పదమైంది. కేవలం బీజేపీతో ఉన్న అనుబంధం వల్లే ఆమెకు అవార్డు వచ్చిందని అంటున్నారు. ఈ అవార్డుల ప్రకటన అనేది ప్రభుత్వం చేతిలో పనే అన్న సంగతి అందరికీ తెలిసిందే. బీజేపీతో కంగనాకు ఉన్న బంధం వల్లే ఈ సారి అవార్డు ప్రకటించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి యాసిడ్ బాధితురాలి పాత్రలో నటించిన దీపికా పదుకొణెకు అవార్డు వస్తుందని అంచనా వేశారు చాలా మంది. కానీ.. మణికర్ణిక సినిమాలో నటనకు గానూ కంగనాకు అవార్డు ప్రకటించడం పట్ల చాలా మంది విస్మయం వ్యక్తంచేస్తున్నారు. కేవలం బీజేపీకి సపోర్టుగా రియల్ లైఫ్ లో చేసిన యాక్టింగ్ కే ఈ అవార్డు వచ్చిందని సెటైర్లు వేస్తున్నారు.