క్రికెటర్లు ఎవరు తెలియకుంటే రిషబ్‌ పంథ్‌ ఎవరమ్మా మరి?

Update: 2021-04-03 00:30 GMT
బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతెల మరియు టీం ఇండియా క్రికెటర్‌ రిషబ్‌ పంథ్‌ ల మద్య ప్రేమ వ్యవహారం సాగుతుంది అంటూ ఆ మద్య మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. సోషల్‌ మీడియాలో జరిగిన ఆ ప్రచారం పై ఇద్దరు కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికి కూడా ఇద్దరి మద్య వ్యవహారం సాగుతుందని నెట్టింట పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఈ సమయంలో ఊర్వశి రౌతెల సోషల్‌ మీడియాలో అభిమానులతో చేసిన చిట్‌ చాట్‌ లో చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. ఆమె మీమర్స్‌ కు చిక్కి పోయింది.

ఆస్క్‌ మీ క్వశ్చన్‌ అంటూ ఊర్వశి సోషల్‌ మీడియాలో అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఆ సందర్బంగా ఒక ఫ్యాన్‌ మీ అభిమాన క్రికెటర్‌ ఎవరు అంటూ ప్రశ్నించగా నేను ఎప్పుడూ క్రికెట్‌ ను చూడను. అందుకే నాకు ఏ ఒక్క క్రికెటర్‌ తెలియదు. కాని నాకు సచిన్‌ సర్ మరియు విరాట్‌ సర్‌ అంటే చాలా గౌరవం ఉందని పేర్కొంది. క్రికెట్‌ చూడను ఏ ఒక్క క్రికెటర్‌ నాకు తెలియదు అంటూనే సచిన్ మరియు విరాట్‌ కోహ్లీలు అంటే గౌరవం అనడం ఏంటో అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇదే సమయంలో రిషబ్‌ పంత్‌ కూడా క్రికెటర్‌ కదా ఆయనతో మీకు ఉన్న స్నేహం ఏంటీ అంటూ ఆమెపై ప్రశ్నలు కురిపిస్తున్నారు. మొత్తానికి ఊర్వశి రౌతెల సమాధానంను ఓ రేంజ్‌ లో ట్రోల్‌ చేస్తున్నారు.
Tags:    

Similar News