స్టార్ కిడ్స్ హీరోలుగా పరిచయం కావడం అనేది సర్వసాధారణమైన విషయం. టాలీవుడ్ లో ఈ స్టార్ కిడ్స్ హంగామా మరీ ఎక్కువ. ఎంతమంది స్టార్ కిడ్స్ ఉన్నప్పటికీ సినీ నేపథ్యం నున్న కుంటుంబాల నుండి ఇంకా కొత్తవారు వస్తూనే ఉన్నారు. అయితే అందరికీ విజయం దక్కుతుందా.. హీరోలుగా నిలదొక్కుకుంటారా అంటే మాత్రం అది చాలా కష్టం అనే చెప్పాలి. తాజాగా నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి 'చూసీ చూడంగానే' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సినిమా ఎలా ఉంది..హీరో ఎలా ఉన్నాడు అంటే మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది.
సినిమా గురించి మాట్లాడుకుంటే యావరేజ్ రివ్యూస్ కూడా రాలేదు.. రొటీన్ గా.. బోరింగ్ గా ఉందని తేల్చారు. ఇక హీరోకు లుక్స్ విషయంలో మంచి మార్కులే పడ్డాయి కానీ యాక్టింగ్ జస్ట్ ఓకే అనిపించుకున్నాడు. అయితే ఈ సినిమాలో శివ పోషించిన పాత్రకు మంచి నటుడు అవసరం. కానీ కొత్త కుర్రాడు కావడంతో ఆ పాత్రకు తగ్గట్టు నటించ లేకపోయాడు. దీంతో ఎక్కువమంది ప్రేక్షకులు సినిమాతో కనెక్ట్ కావడం లేదని అంటున్నారు.
రాజ్ కందుకూరి 'పెళ్ళిచూపులు' సినిమాతో విజయ్ దేవర కొండ కు సోలో హీరోగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమా విజయ్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. 'అర్జున్ రెడ్డి'.. 'గీత గోవిందం' సినిమాలతో స్టార్డమ్ దక్కింది కానీ 'పెళ్ళిచూపులు' విజయ్ కెరీర్ ను మలుపు తిప్పింది. సరిగ్గా అలాగే రాజ్ కందుకూరి 'చూసీ చూడంగానే' సినిమాతో బ్రేక్ ఇవ్వాలని అనుకున్నారట. అయితే అందరూ విజయ్ దేవర కొండలు కాలేరు.. రౌడీలు అంతకన్నా కాలేరని సోషల్ మీడియా లో కామెంట్లు పడుతున్నాయి.