దర్శకధీరుడు రాజమౌళి రెండేళ్ల గ్యాప్ తీసుకొని తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ 'ఆర్.ఆర్.ఆర్' (రౌద్రం రణం రుధిరం). స్టార్ట్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చరణ్ 'మన్నెం దొర అల్లూరి సీతారామరాజు'గా కనిపిస్తుండగా తారక్ 'కొమరం భీమ్' పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. యావత్ సినీ అభిమానులు 'ఆర్.ఆర్.ఆర్' సినిమా కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. కాగా 'ఆర్.ఆర్.ఆర్.' సినిమాని రాజమౌళి తన గత సినిమాలకు దీటుగా మార్కెట్ చేయాలని చూస్తున్నారు. ఈ చిత్రంపై క్రియేట్ అయిన హైప్ వల్ల చాలా మంది కరోనా భయం లేనప్పుడు ఈ సినిమాను చాలా ఏరియాలలో అమ్మేయాలని నిర్ణయించుకున్నారట.
ఈ క్రమంలో 'బాహుబలి 2' రేంజ్ ఫ్యాన్సీ రేట్ కి అగ్రిమెంట్ చేసుకున్నారట. రాజమౌళి సినిమా కాబట్టి ఎప్పుడు రిలీజ్ అయినా ఈజీగా డబ్బులు వెనక్కి వచ్చేస్తాయనే నమ్మకంతో ఉన్న బయ్యర్లు.. నిర్మాత ఎంత చెబితే అంత అడ్వాన్స్ గా ఇచ్చారట. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో పరిస్థితులు మారిపోయాయి. సినిమా రిలీజ్ అయినా ప్రేక్షకులు ఒకప్పటిలా థియేటర్స్ కి వచ్చే పరిస్థితులు ఉండకపోవచ్చనే అనుమానం కలుగుతోంది. దీంతో 'ఆర్.ఆర్.ఆర్' సినిమాకి అడ్వాన్స్ ఇచ్చిన వారు ఆలోచనలో పడ్డారట. ఈ క్రమంలో సినిమాని కొనుకున్న వాళ్ళు డబ్బులు వెన్నకి వస్తాయో రావో అనే భయంతో ఇచ్చిన అడ్వాన్స్ లు వెనక్కి ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నారట. క్రైసిస్ అయ్యాక అడ్వాన్స్ మళ్ళీ ఇస్తామని.. అప్పటి వరకు డబ్బులు లాక్ చేయడం ఎందుకని బయ్యర్స్ అడుగుతున్నారట. భారీ బడ్జెట్ సినిమాలన్నిటికీ ఇదే పరిస్థితి ఉందని సమాచారం.