వర్మ ఇవన్ని ముందే ఊహించలేదా ?

Update: 2019-03-18 07:45 GMT
లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో అనుమానాలే నిజమవుతున్నాయి. సెన్సార్ తో ముందు పేచీ వచ్చిందని ఒకసారి లేదు ఇప్పుడు సానుకూలంగా ఉన్నారని మరోసారి వర్మ లేనిపోని అయోమయాన్ని సృష్టిస్తున్నాడు. ఈ నెల 21 రిలీజ్ లేదనే విషయం మీద క్లారిటీ వచ్చేసింది. పోనీ 29కి వాయిదా వేస్తారా అంటే ఆ మాటా కాన్ఫిడెంట్ గా వర్మ చెప్పలేకపోతున్నాడు. లేదు ఎన్నికలు ఏప్రిల్ 11 అయ్యాకే రిలీజ్ చేస్తారు అనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడున్న బజ్ సగానికి పైగా తగ్గిపోతుంది.

ముఖ్యంగా అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉన్న వర్గమంతా ఇది ప్రచారానికి ఉపయోగపడదు అని తెలిసినప్పుడు చూసేందుకు ఆసక్తి చూపించరు. ప్రెస్ మీట్ పెడతాను అని చెప్పి మళ్ళి మాట మార్చేసిన వర్మ ట్విట్టర్ వేదికగా చట్టంలోని సెక్షన్లను ఉదాహరిస్తూ తన వెర్షన్ కు గట్టిగానే వినిపిస్తున్నాడు కాని జరుగుతున్న పరిణామాలు తనకు అనుకూలంగా లేవన్న మాట వాస్తవం

ఇక్కడే ఓ సందేహం కలుగుతుంది. వర్మకు ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనే ముందస్తు అవగాహన ఉండే ఉంటుంది. దాన్ని గుర్తించి ఓ రెండు మూడు వారాల ముందే ఫైనల్ కాపీ రెడీ చేసుకుని సెన్సార్ కు వెళ్లి ఉంటే ఎలాంటి ఇబ్బంది వచ్చి ఉండేది కాదు. అప్పటిదాకా సైలెంట్ గా ఉండి ఇప్పుడు హడావిడి పడుతున్న వైనాన్ని చూసి అనుమాన పడుతున్న వారు లేకపోలేదు.

ఫిబ్రవరిలోనే షూటింగ్ పూర్తి చేసి ఉంటే అదే నెలలో సర్టిఫికేట్ వచ్చి ఆటంకాలు ఎదురయ్యేవి కావు. కాని ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. 29న విడుదల చేసినా కొంత నయం. అలా కాకుండా అదీ మిస్ చేసుకుంటే మాత్రం మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాన్ని లక్ష్మీస్ ఎన్టీఆర్ చేజేతులా మిస్ చేసుకున్నట్టు అవుతుంది. పైన చెప్పినవి ముందుగా వర్మ ఆలోచించినా లేకపోయినా ఇప్పుడు మాత్రం ఇంకాస్త సీరియస్ గా తీసుకోవడం చాలా అవసరం. అతని లాయర్ ఇదే పని మీదున్నారట.
Tags:    

Similar News