మెగాస్టార్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే టైటిల్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందరూ అనుకుంటున్నట్లు ఈ సినిమా టైటిల్ పై ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు మెగాస్టార్. గత కొంతకాలంగా ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. కానీ అభిమానులు మాత్రం మెగాస్టార్ - కొరటాల శివ కాంబినేషన్ పై భారీ హైప్ క్రియేట్ చేసుకున్నారు. అందుకే అప్డేట్స్ వచ్చినా రాకపోయినా సోషల్ మీడియాలో ఆచార్య టైటిల్ తో హల్చల్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ పుట్టినరోజున టైటిల్ పై అయినా క్లారిటీ ఇస్తే బాగుంటుందని వారు కోరుతున్నారు. ఈ నెల 22న మెగాస్టార్ చిరు పుట్టినరోజు. ఈ సందర్బంగా ట్విట్టర్లో రికార్డుల గోల ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. అభిమానులు తమ హీరోల హ్యాష్ ట్యాగ్ లతో, కామన్ డీపీలతో హోరెత్తిస్తున్నారు. మెగాస్టార్ ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజిలో ట్విట్టర్ లో ఫుల్ హల్చల్ చేయాలనీ ఫిక్స్ అయ్యారట.
మెగాస్టార్ కామన్ డీపీని ఓ ప్రముఖ సెలబ్రిటీ చేత లాంచ్ చేయనున్నారని సమాచారం. అలాగే మెగాస్టార్ పై ఓ స్పెషల్ సాంగ్ కూడా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇవన్నీ ఉన్నా అసలు సినిమా టైటిల్ ఏంటి? తదుపరి సినిమా విషయం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలి అంటున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉండగా.. ఆచార్య తర్వాత మెగాస్టార్ లూసిఫర్ చేయనున్నాడు. అలాగే తన పుట్టినరోజున మరో కొత్త సినిమా ప్రకటన ఇవ్వనున్నట్లు సమాచారం. తమిళంలో అజిత్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ వేదాళం. ఆ సినిమాను తెలుగులో మెగాస్టార్ రీమేక్ చేయాలనీ ఆలోచనలో ఉన్నట్లు సన్నిహిత వర్గాల ఇన్ఫర్మేషన్. ఇక బర్త్ డే రోజు ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఇదే గనక నిజమైతే ఆ సినిమాను రాంచరణ్, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తారని ఇండస్ట్రీలో టాక్. చూడాలి మరి మెగాస్టార్ బర్త్ డే రోజున ఇన్ని సర్ప్రైజ్ లు ఉన్నాయో లేదో..!