'బుజ్జీ.. ఇలారా' టీజర్: విభిన్నమైన కథాంశంతో రూపొందిన సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌

Update: 2021-10-18 08:30 GMT
హీరో కమ్ హాస్యనటులు సునీల్‌ - ధన్‌ రాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ''బుజ్జీ.. ఇలారా''. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌ అనేది సినిమా ట్యాగ్‌ లైన్‌. 'గరుడవేగ' అంజి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర‌రెడ్డి దీనికి క‌థ‌ - స్క్రీన్‌ ప్లే అందించడం విశేషం. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

వరంగల్ నగరంలో వరుస కిడ్నాపులు జరగడంతో పోలీసులు హై టెన్షన్ కు గురవుతున్నట్లు చెప్పడంతో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. ఇందులో ధన్‌ రాజ్‌ సీఐ కేశవ్‌ నాయుడుగా కనిపించగా.. మహమ్మద్‌ ఖయ్యుమ్‌ అనే పోలీస్ గా సునీల్‌ నటించారు. కిడ్నాప్ చేసి కిరాతకంగా హత్య చేస్తున్న హంతకుడిని పట్టుకోడానికి పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపడుతున్నారు. ఈ క్రైమ్స్ కి ఒక పోలీస్ బాధ్యుడని సునీల్ చెప్తుండగా.. దీని వెనుక పెద్ద గ్యాంగ్ ఉందని ధనరాజ్ అభిప్రాయ పడుతున్నారు. సునీల్ - ధనరాజ్ మధ్య ఫైట్ సీన్ ని కూడా ఇందులో చూపించారు.

నగరంలో క్రైమ్స్ చేస్తున్నది ఎవరు? కిడ్నాప్స్ వెనుక అసలు కారణమేంటి? పోలీసులు ఈ కేసుని ఎలా ఛేదించారు? అనేది తెలియాలంటే ''బుజ్జీ.. ఇలారా'' సినిమా చూడాల్సిందే. ట్యాగ్ లైన్ ని బట్టే ఇది విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న సైకలాజికల్‌ థ్రిల్లర్‌ అని తెలుస్తుంది. ఇందులో చాందిని త‌మిళ‌ర‌స‌న్‌ - పోసాని కృష్ణ‌ముర‌ళి - శ్రీకాంత్ అయ్య‌ర్‌ - స‌త్య‌కృష్ణ‌ - వేణు - భూపాల్‌ - టెంప‌ర్ వంశీ త‌దిత‌రులు ఇతర పాత్రలు పోషించారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

రూపా జ‌గ‌దీశ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్ ఎల్ఎల్‌పి - జీ నాగేశ్వ‌ర‌రెడ్డి టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై అగ్ర‌హారం నాగిరెడ్డి - సంజీవ‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. గ‌రుడ‌వేగ అంజి ఈ సినిమాకి దర్శకత్వం వహించడంతో పాటు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చోటా కె.ప్ర‌సాద్‌ ఎడిటర్ గా.. చిన్నా ఆర్ట్ డైరెక్టర్ గా వ‌ర్క్ చేస్తున్నారు. ఈ చిత్రానికి భాను - నందు డైలాగ్స్ అందిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ''బుజ్జీ.. ఇలారా'' చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.




Full View
Tags:    

Similar News