తెలుగులో క్రిటిక్స్ ప్రశంసలు పొందిన జెర్సీ చిత్రాన్ని హిందీలో అదే టైటిల్ తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీ జెర్సీ చిత్ర నిర్మాతలు కొత్త పోస్టర్ తో అభిమానులను అలరించారు. ఒరిజినల్ తెలుగు సినిమా జెర్సీకి దర్శకత్వం వహించిన జాతీయ అవార్డు గ్రహీత గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రం కొత్త సంవత్సరం కానుకగా ఒక రోజు ముందే అంటే డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్త పోస్టర్ సినిమాలో తండ్రీ కొడుకుల బంధానికి ప్రాణం పోసింది. షాహిద్ కపూర్ నటించిన జెర్సీ ఇప్పటికే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రంగా ప్రచారం ఉంది. అందుకే సరైన రిలీజ్ తేదీని టీమ్ ఫిక్స్ చేసుకుంది. కబీర్ సింగ్ లాంటి అద్భుతమైన విజయం తర్వాత కొంత గ్యాప్ తో షాహిద్ జెర్సీ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే పోస్టర్లు.. వీడియోలు హృదయాలను గెలుచుకున్నాయి. షాహిద్ కపూర్ పాత్ర.. అతని కొడుకు కిట్టు (రోనిత్ కమ్రా పోషించిన) షూలేస్ లను కడుతున్న పోస్టర్ ఆద్యంతం ఎమోషన్ ని కలిగిస్తోంది.
తన కొడుక్కి జెర్సీ అయినా కొనివ్వలేని తండ్రిగా.. విఫలమైన క్రికెటర్ గా షాహిద్ నటిస్తున్నారు. జెర్సీ హృదయాల్ని కదిలించే కథ. కలల్ని నిజం చేసుకోవాలనుకునే యువతరం కథ.. యూత్ శక్తిపై మీకు నమ్మకం కలిగించేలా.. సినిమా ఆద్యంతం సీటు అంచున ఉంచేలా అద్భుతంగా తెరకెక్కిందిట. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ సరసన మృణాల్ ఠాకూర్ తొలిసారిగా నటిస్తుంది. సీనియర్ నటుడు పంకజ్ కపూర్ పెద్ద తెరపైకి తిరిగి వస్తున్నారు. అతను ఈ చిత్రంలో క్రికెట్ కోచ్ గా కనిపిస్తాడు.
తాజాగా షాహిద్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టర్‌ను పంచుకున్నాడు. “తండ్రిగా ఇది నాకు ఇష్టమైన జెర్సీ పోస్టర్” అని రాశాడు. అతని సోదరుడు ఇషాన్ ఖట్టర్ పోస్టర్ కోసం వ్యాఖ్యల విభాగంలో తన హార్ట్ ని కురిపించాడు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ - అమన్ గిల్- దిల్ రాజు- ఎస్ నాగ వంశీ సమర్పిస్తున్నారు. షాహిద్ కపూర్ మళ్లీ జెర్సీ ట్యూన్స్ ని హమ్ చేయడం కోసం కబీర్ సింగ్ సంగీత స్వరకర్తలు సచేత్-పరంపరా ని బరిలో దించారు.
షాహిద్ ఇటీవల తన అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యాడు. అతని జెర్సీ షూట్ గురించి అనేక విషయాలు వెల్లడించాడు. ఒక ప్రశ్నకు సమాధానంగా,.. షాహిద్ కపూర్ సినిమా చిత్రీకరణ సమయంలో తన పెదవికి గాయం అయిన సంగతి తెలిసిందే. 31 డిసెంబర్ డేట్ లాకైంది. నానీ జెర్సీలా మెప్పిస్తుందా లేదా? అన్నది వేచి చూడాలి.