కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నో రంగాలపై కరోనా ప్రభావం ప్రత్యక్షంగానే కనపడుతోంది. అలాంటి రంగాలలో సినిమా రంగం ఒకటి. టాలీవుడ్ విషయమై మాట్లాడుకుంటే.. చాలా రోజులుగా సినిమా థియేటర్లు మూత పడ్డాయి.. కొత్త సినిమాల విడుదల నిరవధికంగా వాయిదా పడింది. షూటింగులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దీంతో సినీ రంగానికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి కనీసం ఏడెనిమిది నెలలు పడుతుందని సీనియర్ నిర్మాతలే స్వయంగా వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదిలా ఉంటే లాక్ డౌన్ విరమణ ప్రకటించిన తర్వాత పది పదిహేను రోజుల్లోనే షూటింగులకు కూడా అనుమతులు వస్తాయని వెంటనే షూటింగ్ మొదలు పెట్టాలని ఫిలింమేకర్లు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇలా చేయడానికి ప్రాక్టికల్ గా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ విషయంపై నిర్మాతలు ఇప్పటికే చర్చించుకుని ఛాంబర్ లో కొన్ని రూల్స్ రెడీ చేసి పెట్టారని సమాచారం అందుతోంది. ఇప్పటికీ ఆగిపోయిన పలు సినిమాల షూటింగులు వెంటనే ప్రారంభించాల్సి ఉంది. లేకపోతే వడ్డీల భారం ఎక్కువై నిర్మాతలకు నష్టం తప్పదు.
హీరోలు.. హీరోయిన్లు.. ఇతర ఆర్టిస్టులకు ఈ రూల్స్ వర్తింప చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
*ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న సినిమాలను పూర్తి చేసిన తర్వాతే హీరోలు.. ఆర్టిస్టులు కొత్త సినిమాలు సైన్ చేయాలి.
*లాక్ డౌన్ సమయంలో వృధాగా పోయిన కాల్షీట్లను.. డేట్లను సాకుగా చూపించి నిర్మాతలను ఇబ్బంది పెట్టకూడదు. వాటికి బదులుగా కొత్త కాల్షీట్లు కేటాయించాలి.
* డైరెక్ట్ రిలీజ్ మాత్రమే చేయాలి.. ఓటీటీ అసలే వద్దు అని హీరోలు ఒకవేళ పట్టుబడితే..ఆ సినిమా కనుక థియేటర్లో వర్కవుట్ కాకపోతే నిర్మాతకు కలిగే నష్టాన్ని సదరు హీరోనే భరించాలి.
*నిర్మాతలకు హీరోలు నటీనటులు సహకరించాలి.
*ఈ రూల్స్ కి వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై ఫిలిం ఛాంబర్ యాక్షన్ తీసుకుంటుంది.
* ఒకవేళ ఎవరైనా నిర్మాత ఈ నిబంధనలకు వ్యతిరేకంగా ముందుకు పోతే అతనిపై కూడా చర్యలు తీసుకుంటారు.
మరి ఈ రూల్స్ ఎంతవరకు అమలులోకి వస్తాయి? హీరోలు నిజంగా ఇలాంటి నిబంధనలు పాటిస్తారా అనేది వేచి చూడాలి.