చిరు కోసం కొత్త సింగర్‌ ని పట్టిన డీఎస్పీ

Update: 2016-09-23 01:30 GMT
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150కి.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ మ్యూజిక్ విషయంలో దేవిశ్రీ కొత్త కొత్త ప్రయోగాలు చేసేందుకు ఏ మాత్రం సందేహించడం లేదు. చిరు కెరీర్ లోనే ప్రతిష్టాత్మకమైన ఈ చిత్రాన్ని.. తాను సంగీతం అందించిన అన్ని మూవీస్ లోకి ప్రత్యేకంగా నిలిచిపోయేలా డీఎస్పీ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నుంచి ఇటు సాంగ్స్ వరకూ.. అన్ని యాంగిల్స్ లోను ఖైదీ నెంబర్ 150 ని స్పెషల్ హ్యాండిల్ చేస్తున్నాడు.

మెగాస్టార్ మెగా మూవీ కోసం ఓ పంజాబ్ సింగర్ ని పట్టుకొచ్చాడు దేవిశ్రీ. జాస్మిన్ శాండ్లాస్ అనే ఈ లేడీ సింగర్.. సింగిల్స్ తో విపరీతమైన ఫేమ్ సంపాదించుకుంది. యూట్యూబ్ లో సోషల్ మీడియాలో బోలెడంత ఫేమ్ ఉన్న చిన్నది.. గతంలో కిక్.. వన్ నైట్ స్టాండ్ వంటి హిందీ చిత్రాలకు కూడా పాటలు పాడింది. ఈమతే ఓ స్పెషల్ సాంగ్ పాడిస్తున్న దేవిశ్రీ.. ఆమెతో దిగిన ఓ ఫోటోను షేర్ చేయడం ద్వారా ఈ విషయం తెలిపాడు. మ్యూజిక్ సెన్సేషన్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న మెగాస్టార్ మూవీకి వర్క్ చేయడం చాలాసంతోషంగా ఉందని చెబుతోంది జాస్మిన్.

గతంలో కూడా డీఎస్పీ ఇలాంటి ఎక్స్ పెరిమెంట్స్ చేశాడు. అపాచీ ఇండియన్.. రఘు దీక్షిత్.. బాబా సెహగల్.. నేహా భాసిన్ వంటి వారితో పాడించిన పాటలకు మంచి క్రేజ్ వచ్చింది. మెగా150లో జాస్మిన్ శాండ్లాస్ పాడే పాట కూడా సంథింగ్ స్పెషల్ గా ఉండనుందని తెలుస్తోంది.
Tags:    

Similar News