ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది అవుతుంది. అయితే ఇప్పటి వరకు తారక్ తన నెక్స్ట్ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళలేదు. దీనికి కారణం కొరటాల శివ అని చెప్పాలి. కొరటాల శివ చివరిగా ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ మూవీ అతని కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అలాగే చాలా విమర్శలు ఎదుర్కొనేలా చేసింది. ఓ విధంగా చెప్పాలంటే ఆచార్య రిజల్ట్ కొరటాల శివని మానసికంగా కూడా భాగా ఇబ్బంది పెట్టిందని చెప్పాలి. తరుచుగా చిరంజీవి ఆచార్య డిజాస్టర్ ని దృష్టిలో ఉంచుకొని పరోక్షంగా కొరటాలని నిందిస్తూనే ఉన్నారు.
తాజాగా వాల్తేర్ వీరయ్య సక్సెస్ మీట్ లో కూడా కొరటాల శివని ఉద్దేశించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కూడా కొరటాల మీద ఎన్టీఆర్ నమ్మకం ఉంచారు. అయితే స్క్రిప్ట్ విషయంలో మాత్రం కొరటాలకి తారక్ చాలా కండిషన్స్ పెట్టినట్లు తెలుస్తుంది. బౌండ్ స్క్రిప్ట్ పక్కాగా సిద్ధం చేసిన తర్వాతనే సెట్స్ పైకి వెళ్దామని సూచించినట్లు తెలుస్తుంది.
ఈ నేపధ్యంలో ఆచార్య తరహాలో సెట్స్ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కథలు ఇష్టారీతిలో మార్పులు చేయకుండా సెట్స్ పైకి వెళ్లేసరికి ఎడిటెడ్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసే పనిలో కొరటాల పడటంతో ఎక్కువ సమయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ ని ఫిక్స్ చేశారు.
అలాగే ఆర్ట్ డైరెక్టర్ ని కూడా ఫైనల్ చేశారు. ఈ మూవీలో తారక్ ఫిషర్ మెన్ వర్గానికి చెందిన వాడిగా కనిపిస్తాడని తెలుస్తుంది. దీనికి తగ్గట్లుగానే సెట్స్ ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ కావడంతో పాటు క్యాస్టింగ్ కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో ఈ నెలలోనే ఎన్టీఆర్ 30 మూవీ పూజా కార్యక్రమాలు మొదలు పెట్టి ఫిబ్రవరి లో సెట్స్ పైకి వెళ్ళేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలో దీనికి సంబందించిన అఫీషియల్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందని ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.