తమిళ ఇండస్ట్రీలో ఇళయదళపతి విజయ్, తల అజిత్ లకున్న క్రేజే వేరు. వీరి సినిమా విడుదలైందంటే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా వుండదు. బాక్సాఫీస్ వద్ద వీరి సినిమాలు చేసే హల్ చల్ అంతా ఇంతా కాదు. ఏకంగా బాక్సాఫీస్ ని షేక్ చేసేస్తుంటాయి. రికార్డు స్థాయిలో వసూళ్లని కురిపిస్తుంటాయి. అంతే కాకుండా వీరి సినిమాలు వందల కోట్లు వసూలు చేస్తూ ఇప్పటికే రికార్డులు సృష్టిస్తుండటంతో వీరికి తమళ ప్రేక్షకులు గత కొన్నేళ్లుగా బ్రహ్మరథం పడుతున్నారు.
సూపర్ స్టార్ రజీనీకాంత్ ఫ్లాపులతో సైడవుతుండటంతో ఆ స్థానానికి ఈ ఇద్దరు హీరోలు గత కొన్నేళ్లుగా పోటీపడుతున్నారు. ఈ పోటీలో ముందు వరుసలో నిలుస్తున్నాడు హీరో విజయ్. అయితే అజిత్ కూడా విజయ్‌కి దరిదాపుల్లోనే వున్నాడు. ఈ ఇద్దరు హీరోలు దాదాపు గా 100 కోట్ల వరకు పారితోషికాలు తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అజిత్ కొత్త ప్రాజెక్ట్ కోసం 100 కోట్లకు మించి పారితోషికం కింది డిమాండ్ చేసినట్టుగా చెబుతున్నారు.
అజిత్ నటించిన తాజా చిత్రం `వలిమై`. `ఖాకీ`, నేర్కొండ పార్వై ఫేమ్ హెచ్ వినోద్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయినా సరే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రికార్డుల మోత మోగించింది. వసూళ్ల పరంగా రికార్డులు సృష్టించింది. డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్నా ఈ మూవీ భారీ వసూళ్లని సాధించడం అజిత్ కున్న క్రేజ్ ని తెలియజేసిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
`వలిమై` దాదాపు 200 కోట్ల మేర వసూళ్లని సాధించిందరని తమిళ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీ రిలీజ్ తరువాత వెంటనే ఇదే దర్శకుడితో మరో మూవీ మొదలుపెట్టిన అజిత్ తాజాగా నయనతార ప్రియుడు విఘ్నేష్ శివవన్ తో ఓ భారీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించబోతోంది. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించారు. నయనతార హీరోయిన్ నటిస్తున్న ఈ చిత్రం కోసం అజిత్ ఏకంగా 105 కోట్లు పారితోషికం డిమాండ్ చేశారని, అంత మొత్తం ఇవ్వడానికి లైకా సంస్థ రెడీ అయిందని తెలిసి అంతా షాక్ అవుతున్నారు.
డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమాలకే 200 కోట్లు రాబడుతుండటంతో అజిత్ అడిగినంత ఇచ్చిన లైకా సంస్థ తనతో భారీ డీల్ ని కుదుర్చుకుందిని, ఇదే ఊపుతో ఈ ప్రాజెక్ట్ ని త్వరలోనే పట్టాలెక్కించబోతోందని కోలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.