అందాల చందమామ కాజల్ అగర్వాల్.. నెలవంక కనుల నయనతార ఇద్దరూ కెరీర్ బండిని సమాంతరంగా రన్ చేసిన సంగతి తెలిసిందే. రెండు దశాబ్ధాల పాటు ఎదురే లేకుండా అగ్ర నాయికలుగా సౌత్ లో కెరీర్ ని సాగించారు. ఎవరికి వారు గొప్ప స్థానాలకు ఎదిగారు. అయితే కాలక్రమంలో నయన్ తీరు తెన్నులు ఒకలా ఉంటే కాజల్ తీరుతెన్నులు ఇంకోలా ఉన్నాయి.
అందాల నయనతార అస్సలు తన సినిమా ప్రమోషన్స్ కి వచ్చేందుకు ఆసక్తిని కనబరచరు. ముందే దర్శకనిర్మాతలకు తన కండీషన్ చెప్పేస్తుంటారు. కానీ కాజల్ అలా కాదు. తన సినిమాని తాను ప్రమోట్ చేసుకునేందుకు ఎప్పుడూ ముందుంటుంది. మేకర్స్ క్వీన్ గా వెలిగిపోతోంది. అయితే ఎవరు ఏం చేసినా ఎవరి కారణాలు వారికి ఉంటాయి. కాజల్ తో పోలిస్తే నయనతార చాలా వివాదాల్లో నలిగిపోయారు.
వరుస ప్రేమాయణాలు తనకు చాలా చిక్కుల్ని తెచ్చాయి. కెరీర్ ఆరంభమే శింబుతో ప్రేమాయణం అనంతరం బ్రేకప్.. ఆ తర్వాత ప్రముఖ టాలీవుడ్ యువహీరోతో ప్రేమాయణం అనంతరం గ్యాప్ ఆ తరవాత దర్శక హీరో ప్రభుదేవాతో ప్రేమాయణం బ్రేకప్ వ్యవహారం తెలిసిందే. ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉంది. ఇన్ని ఎపిసోడ్ల అనంతరం నయన్ అసలు సినిమాలు చేయాలనుకోలేదు.
కానీ చేయాల్సొచ్చింది. అదే క్రమంలో తనకు కొన్ని పరిమితులు ఏర్పడడంతో ప్రమోషన్స్ కి రాలేనని చెప్పేస్తున్నారు. ఇక కాజల్ తొలి నుంచి వివాదాలకు దూరం. తాను ఒక ఇండస్ట్రీ వ్యక్తిని ప్రేమించానని కాజల్ చెప్పిందని ప్రచారమైంది. కానీ ఆ వ్యక్తి ఎవరో ఎప్పటికీ బయటపెట్టలేదు. ఇక ఇటీవల అగ్ర నాయిక హోదాలో ఉండగానే ఆఫర్లు కూడా కాదనుకుని తన చిన్న నాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లుని పెళ్లాడారు. సంతోషమయ జీవనంలో ఒక బిడ్డకు జన్మనిచ్చేందుక సిద్ధమైంది కాజల్.
ఆచార్య సినిమా చేస్తున్న సమయంలో కాజల్ ప్రెగ్నన్సీ హాట్ టాపిక్ అయ్యింది. తన మొదటి బిడ్డ కోసం చందమామ సంసిద్ధమవుతోంది. ఇక తాను నటించిన ఆచార్య ఏప్రిల్ లో విడుదలకు సిద్ధంగా ఉంది, కాజల్ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయాలని కొన్ని ఇంటర్వ్యూలను రికార్డ్ చేయాలని కోరుకుందని తాజాగా టాక్ వినిపిస్తోంది. కానీ దానికి చిరు - చరణ్ అంగీకరించలేదు. కాజల్ వృత్తిగత కమిట్ మెంట్ కి ఆ ఇద్దరూ మంత్రముగ్ధులైపోయారు.
కానీ ప్రస్తుత పరిస్థితిలో తనను ప్రచారానికి పిలిచేందుకు సిద్ధంగా లేరు. కాజల్ ఆఫర్ ను తిరస్కరించారు. ఆమె విశ్రాంతి తీసుకోవాలని తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. కాజల్ ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అయ్యింది. తన కెరీర్ లో చరణ్ సరసన పలు బ్లాక్ బస్టర్లలో నటించిన కాజల్ చిరంజీవి సరసన ఖైదీ నంబర్ 150 లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రంలో నటించింది. చిరు సరసన ఇప్పుడు ఆచార్యలో కనిపించనుంది.