ఫోటోస్టోరీ: బ్యాక్ నుంచి చంద‌మామ బేబి బంప్ లుక్

Update: 2022-03-21 05:30 GMT
చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ గ‌ర్భం దాల్చిన‌ప్ప‌టి నుంచి ఇన్ స్టా లో చేస్తోన్న‌ హంగామా గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. నిత్యం బేబి బంప్ ఫోటోల‌తో అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటుంది. మాతృమూర్తి కాబోతున్న త‌న‌లో ఉత్సాహాన్ని నిరంత‌రం  అభిమానుల‌తో చాటుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది. బేబి బంప్ లుక్ లో కొత్త ఫోటో షూట్ల‌తో నెటి జ‌నుల్ని ఆక‌ట్టుకుటుంటుంది. ఈ విష‌యంలో బిజీగా ఉండే భ‌ర్త గౌత‌మ్ కిచ్లూ ని సైతం విడిచిపెట్ట‌లేదు. భ‌ర్త‌ని సైతం మ్యాగజైన్ క‌వ‌ర్ పేజీల ఫోటోల కోసం రంగంలోకి దించేసింది.

ఇప్ప‌టికే జంట‌గా ఓ మ్యాగ‌జైన్  కోసం ఫోటో సెష‌న్లో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఇక కాజ‌ల్ కి కావాల్సినంత స‌మ‌యం దొర‌క‌డంతో రోజూ ఏదో ఒక ఫోటోతో అభిమానుల్ని అల‌రిస్తుంది. తాజాగా మ‌రో కొత్త ఫోటోతో ఇన్ స్టాలో హల్చ‌ల్ చేస్తోంది. వంగ‌పువ్వు రంగు క్యాజువ‌ల్ వేర్ లో కాజ‌ల్ ని వెనుక నుంచి  క్యాప‌ర్ చేసిన ఫోటో ఒక‌టి నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇందులో కాజ‌ల్ ఎదురుగా క‌నిపిస్తున్న ఖాళీ ప్ర‌దేశాన్ని.. ప్ర‌కృతి గ్రీన‌రి అందాల్ని ఆస్వాదిస్తుంది. ఎండ తీవ్రత ఎక్కువ‌గానే క‌నిపిస్తుంది. అందుకే ఇలా నీడ‌ప‌ట్టున ఉండే ప్ర‌కృతి అందంలో మ‌మేక‌మైన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది.

ఇక కాజ‌ల్ సినిమాల విష‌యానికి వ‌స్తే త‌మిళ్..తెలుగు..హిందీ అంటూ మూడు భాష‌ల్ని చుట్టేస్తోంది. కోలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేస్తోంది. కొన్ని సినిమాలు షూటింగ్ పూర్త‌య్యాయి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న `ఆచార్య‌` న‌టిస్తోంది. చిరంజీవితో క‌లిసి న‌టించ‌డం ఇది రెండ‌వ సారి. గ‌తంలో `ఖైదీ  నెంబ‌ర్ 150` లో మెగాస్టార్ కి జోడీగా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా పెద్ద హిట్ అయింది.

అదే సెంటిమెంట్ తో  కొర‌టాల శివ మ‌రోసారి కాజల్ ని చిరు స‌ర‌స‌న `ఆచార్య‌`లో రిపీట్ చేసారు. `ఇండియ‌న్ -2` లో విశ్వ న‌టుడు  క‌మ‌ల్ హాస‌న స‌ర‌స‌న న‌టిస్తోంది. ఇప్ప‌టికే కొంత భాగం షూటింగ్ కూడా పూర్త‌యింది. కాజ‌ల్ పై చిత్రీక‌ర‌ణ‌కు సంబంధించి దాదాపు షూట్ పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. కాజ‌ల్ గ‌ర్భం దాల్చిన త‌ర్వాత  షూటింగ్ ల‌కు దూర‌మైంది. అలాగే కొత్త ప్రాజెక్ట్ లు త‌గ్గుముఖం ప‌ట్టాయి.
Tags:    

Similar News