క్రేజీ టాక్‌.. ఆ యంగ్ హీరోకు భార్య కాబోతున్న కీర్తి సురేష్‌..?!

Update: 2022-04-02 04:41 GMT
మ‌ల‌యాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `నేను శైలజ` చిత్రంతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. త‌న‌దైన టాలెంట్‌తో అన‌తి కాలంలోనే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈమె న‌టించిన `మహానటి` చిత్రం ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కీర్తి సురేష్‌.. ఇక వెన‌క్కి తిరిగి చూసుకోలేదు.

తెలుగుతో పాటు త‌మిళ్, మ‌ల‌యాళ భాష‌ల్లో వ‌రుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. కీర్తి సురేష్ గురించి ఈ క్రేజీ టాక్ ప్ర‌స్తుతం బ‌లంగా వినిపిస్తోంది. అదేంటంటే.. ఈ భామ టాలీవుడ్‌లోకి చెందిన ఓ యంగ్ హీరోకు భార్య కాబోతోంద‌ట‌. అయితే రియ‌ల్‌గా కాదండోయ్‌.. రీలే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్ గ‌త కొంత కాలం నుంచి స‌రైన హిట్టు లేక స‌త‌మ‌తం అవుతున్న సంగ‌తి తెలిసిందే.

ఇటీవ‌ల విడుద‌లైన `ఆడవాళ్ళు మీకు జోహార్లు` చిత్రం కూడా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. దీంతో ఎలాగైనా స‌క్సెస్ ట్రాక్ ఎక్కాలని క‌సి మీద ఉన్న శ‌ర్వానంద్‌.. `రౌడీ ఫెలో`, `ఛల్ మోహన రంగ` చిత్రాల ద‌ర్శ‌కుడు కృష్ణ చైతన్యతో ఓ సినిమా చేసేందుకు తాజాగా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడ‌ట‌. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్‌పై నిర్మించ‌బోతున్నారు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా మొద‌ట కృతి శెట్టిని అనుకున్నార‌ట‌. కానీ, ఆమెకు డేట్స్ సర్దుబాటు కాక‌పోవ‌డంతో.. సున్నితంగా శ‌ర్వా సినిమాను రిజెక్ట్ చేసింద‌ట‌. దీంతో మేక‌ర్స్ కీర్తి సురేష్‌ను సంప్ర‌దించ‌గా.. ఆమెకు సినిమా కాన్సెప్ట్ న‌చ్చ‌డంతో వెంట‌నే ఓకే చెప్పింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు, ఈ సినిమాలో శ‌ర్వాకు భార్యగా కీర్తి సురేష్ క‌నిపించ‌బోతోంద‌ని, ఇందులో ఆమెకు ఒక‌ కొడుకు కూడా ఉంటాడ‌ని అంటున్నారు. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాల్సి ఉంది.

కాగా, కీర్తి సురేష్ ప్ర‌స్తుతం తెలుగులో మ‌హేష్ బాబు స‌ర‌స‌న `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తుంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 12న విడుద‌ల కానుంది. అలాగే న్యాచుర‌ల్ స్టార్ నానికి జోడీగా `ద‌స‌రా` సినిమాలోనూ కీర్తి న‌టిస్తోంది.
Tags:    

Similar News