`విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ` శ్రీరామ‌న‌వమి ట్రీట్ ఇదే!

Update: 2022-04-10 05:46 GMT
`ఎస్. ఆర్. క‌ళ్యాణ‌మండ‌పం` చిత్రంతో యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం కి మంచి గుర్తింపు ద‌క్కిన సంగ‌తి తెలిసిందే.  కోవిడ్ కాలంలో రిలీజ్ అయిన రొమాంటిక్ యాక్ష‌న్ డ్రామా పాజిటివ్ టాక్ తో బాగానే ఆడింది. థియేట‌ర్లు పూర్తిగా తెర‌వ‌ని రోజుల్లో రిలీజ్ అయి స‌క్సెస్ అందుకోవ‌డం తో కిర‌ణ్ కి మంచి పేరొచ్చింది. వ‌సూళ్ల ప‌రంగా కొంత ప్ర‌భావం ప‌డిన‌ప్ప‌టికీ పూర్తి స్థాయిలో థియేట‌ర్లు అందుబాటులో  ఉంటే మంచి వ‌సూళ్లు సాధించేద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేసాయి. ఆ సినిమాతో  ప్రామిసింగ్ హీరోగా కిర‌ణ్ కి మంచి పేరొచ్చింది. దీంతో యంగ్ హీరోకి బ్యాక్ టూ బ్యాక్ అవ‌కాశాలు ఇంటి త‌లుపు త‌ట్టాయి.

ప్ర‌స్తుతం మెగా బ్యాన‌ర్ గీతా ఆర్స్ట్ అనుబంధ సంస్థ జీఏ-2 పిక్చ‌ర్స్ లో కిర‌ణ్ అబ్బ‌వ‌ర‌పు హీరోగా `విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ`  తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు చెబుతూ మేక‌ర్స్ సినిమాకి సంబంధించిన కొత్త పోస్ట‌ర్ రిలీజ్ చేసారు. ఇందులో బ్యాక్ గ్రౌండ్ లో పురాత‌నమైన గుడి ఎదురుగాల అందంగా ముస్తాబైన గంగిరెద్దు ప‌క్క‌న హీరో ఎర్ర‌గ‌ళ్ల ష‌ర్ట్..లుంగీ ధ‌రించి సీరియ‌స్ గా చూస్తున్నాడు. పోస్ట‌ర్ రోడ్డుకి అటు..ఇటు పాత పాడుబ‌డ్డ బిల్డింగ్ లు క‌నిపిస్తున్నాయి. పోస్ట‌ర్ డిజైన్ లో యాక్ష‌న్ మోడ్ క‌నిపిస్తుంది. పోస్ట‌ర్ ఇంట్రెస్టింగ్ గా హైలైట్ అవుతుంది. మ‌రి సినిమా క‌థ ఏంటి? అన్న‌ది రిలీజ్ వ‌ర‌కూ  క్లారిటీ రాదు.  

షూటింగ్ అప్ డేట్స్  చూస్తే  జ‌వ‌రిలో  సినిమా ప్రారంభోత్సవం జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. థ‌ర్డ్ వేవ్ నేప‌థ్యంలో..ఇత‌ర బిజీ షెడ్యూల్ కార‌ణంగా  షూటింగ్ ఆల‌స్య‌మైంది. ఇటీవ‌లే  సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్  తిరుప‌తిలో మొద‌లైంది. ఇది భారీ షెడ్యూల్. దాదాపు 35 రోజుల పాటు ఏక‌ధాటిగా షూటింగ్ జ‌రిపి కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కించారు. ఈ షెడ్యూల్ ప్ర‌ధాన తారాగ‌ణ‌మంతా పాల్గొంది . ఇంకా  హైద‌రాబాద్ స‌హా ఇత‌ర ప్రాంతాల్లో త‌దుప‌రి షెడ్యూల్స్  ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది.  

స‌మ్మ‌ర్ నేప‌థ్యంలో ఎండ‌లు ముదిరేలోపే షూటింగ్ పూర్తిచేసే అవ‌కాశం ఉంది. ఇందులో కిర‌ణ్ కి జోడీగా  క‌శ్మీరా న‌టిస్తోంది. కంటెట్ బేస్డ్ చిత్రంగా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రానికి నంద కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కొత్త ప్ర‌తిభ‌ని ప్రోత్స‌హించ‌డంలో జీఏ2 ఎప్పుడూ ముందుటుందని మ‌రోసారి ఈ కాంబినేష‌న్ తో రుజువు చేస్తుంది. మెగా బ్యాన‌ర్ లో సినిమా నిర్మాణం కావ‌డంతో మంచి బ‌జ్ క్రియేట్ అవుతోంది. జీఏ-2 గ‌తంలో అందుకున్న స‌క్సెస్ ల నేప‌థ్యంలో ఈ సినిమాపై టీమ్ అంతా కాన్ఫిడెంట్ గా ఉంది.

ఇక యువ ప్ర‌తిభాశాలి కిర‌ణ్ యువ‌తలో క్రేజీ స్టార్ గా మారుతున్నాడు. అవ‌న్నీ సినిమాకి క‌లిసొచ్చే అంశాలు.   ఇంకా కిర‌ణ్  `స‌మ్మ‌త‌మే`..`నేను మీకు బాగా కాల‌వాల్సిన వాడిని` వంటి మ‌రో రెండు సినిమాలు కూడా ఆన్ సెట్స్ లో ఉన్నాయి. ఇలా ఒకేసారి ఏకంగా మూడు సినిమాల్లో న‌టిస్తూ అన‌తి కాలంలోనే బిజీ  స్టార్ గా మారాడు
Tags:    

Similar News