టాలీవుడ్ నుంచి ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ పై దండయాత్రకు సిద్ధమవుతున్నాయి. ఈ వరుసలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న `లైగర్` మూవీ కూడా రాబోతోంది. పూరి జగన్నాథ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ కు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. అనన్యా పాండే హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. పూరి, చార్మిలతో కలిసి కరణ్ జోహార్, అపూర్వమొహతా నిర్మిస్తున్నారు.
కిక్ బాక్సింగ్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ముంబై స్లమ్ ఏరియాలో వుండే ఛాయ్ వాలా కిక్ బాక్సింగ్ లో ఎలా ఛాపియన్ గా మారాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లేంటీ? అనే ఆసక్తికరమైన కథ, కథనాలతో ఈ మూవీని దర్శకుడు పూరి జగన్నాథ్ తనదైన పంథాలో తెరకెక్కించారు. ఇటీవల గ్లింప్స్ ఆఫ్ `లైగర్` పేరుతో విడుదల చేసిన వీడియో సినిమాపై అంచనాల్ని పెంచేసింది.
ఇందులో వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక అతిథి పాత్రలో నటించారు. విజయ్ దేవరకొండ - మైక్ టైసన్ లు పాల్గొనగా కీలక ఘట్టాన్ని యుఎస్ లో పూరి జగన్నాథ్ చిత్రీకరించారట. ఈ సీన్స్ సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. సినిమా పూర్తయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ కి చేరడంతో తన పాత్రకు మైక్ టైసన్ తానే డబ్బింగ్ చెప్పడం విశేషం. శుక్రవారం ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
అంతే కాకుండా తగ్గేదే లే అంటూ మైక్ టైసన్ డబ్బింగ్ చెబుతున్న ఫొటోలని కూడా పంచుకుంది. డబ్బింగ్ అనంతరం మైక్ టైసన్ ఈ మూవీలో మీ టీమ్ తో కలిసి పనిచేసినందుకు చాలా గ్రేట్ గా ఫీలవుతున్నానని, తనని చాలా బగా చూసుకున్నారని టీమ్ ని పొగడటం విశేషం. సినిమాలో విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఫ్యాన్స్ కి ఓ ట్రీట్ లా వుంటాయని, సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు.
ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ రిలీజ్ కోసం వరల్డ్ వైడ్ గా వున్న ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ మూవీని ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. విజయ్ తో పాటు పూరి జగన్నాథ్ భారీ అంచనాలు పెట్టుకున్న ఈ మూవీ ఏ స్థాయి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, మకరంద్ దేశ్ పాండే, అలీ, గెటప్ శ్రీను తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఫైట్స్ కెచ్చా, ఆర్ట్.. జానీ షేక్ బాషా, సినిమాటోగ్రఫీ విష్ణు శర్మ, ఎడిటింగ్ జునైద్ సిద్ధిఖ్