ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం - కలర్స్ స్వాతి రెడ్డి - సముద్రఖని - రాహుల్ విజయ్ - శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న తాజా చిత్రం ''పంచతంత్రం''. ఇందులో నరేష్ అగస్త్య - దివ్య దృష్టి - ఉత్తేజ్ - ఆదర్శ్ బాలకృష్ణ - వికాస్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
'పంచతంత్రం' నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రధాన పాత్రల ఫస్ట్ లుక్స్ మరియు టీజర్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాలోని ఓ పాటను ఆవిష్కరించారు.
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ 'అరెరే అరెరే' అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. 'అరెరే అరెరే.. మాటే రాదే.. మనసే పలికే క్షణములో.. పిలిచి అడిగి ఆరా తీసి..' అంటూ సాగిన ఈ గీతం శ్రోతలను ఆకట్టుకుంటుంది.
ప్రశాంత్ ఆర్ విహారి స్వరపరిచిన ఈ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ను ఎస్పీ చరణ్ మరియు చిన్మయి శ్రీపాద కలిసి ఆలపించారు. కిట్టు విస్సాప్రగడ దీనికి సాహిత్యం అందించారు. వికాస్ ముప్పాల - దివ్య దృష్టి లపై చిత్రీకరించిన 'అరెరే' పాట.. పెళ్లి అయిన దగ్గర నుంచి వారి వైవాహిక జీవితాన్ని చూపిస్తోంది.
ఆధునిక ప్రపంచంలో మానవ సంబంధాలు.. నిత్యం మనకు ఎదురయ్యే ఎన్నో కథలను ఆధారంగా చేసుకుని ''పంచతంత్రం'' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఇది కలర్స్ స్వాతి కంబ్యాక్ సినిమా. అలానే బ్రహ్మానందం చాలా గ్యాప్ తర్వాత చేసిన పూర్తి స్థాయి చిత్రం.
'పంచతంత్రం' సినిమాతో కొత్త దర్శకుడు హర్ష పులిపాక ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. టికెట్ ఫ్యాక్టరీ మరియు ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై అఖిలేష్ వర్ధన్ - సృజన్ ఎరబోలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రాజ్ కె నల్లి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. త్వరలోనే 'పంచతంత్రం' సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
Full View