టాలీవుడ్ లో పాన్ ఇండియా చిత్రాల లిస్ట్ పోను పోను భారీ స్థాయిలో పెరిగిపోతోంది. వరుసగా పాన్ ఇండియా చిత్రాలు దక్షిణాది నుంచి విడుదలై దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తుండటంతో ఇప్పడు ప్రతీ స్టార్ హీరో దృష్టి పాన్ ఇండియా సినిమాపైనే వుంటోంది. అలాంటి చిత్రాలే చేయాలని ప్రతీ హీరో బావిస్తున్నాడు. ప్రస్తుతం ఇదే బాటలో పలువురు హీరోలు వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో బాక్సాఫీస్ మీద దండయాత్రకు రెడీ అయిపోతున్నారు. అందులో విజయ్ దేవరకొండ కూడా వున్నాడు.
పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ నటిస్తున్న బాక్సాంగ్ డ్రామా 'లైగర్''. ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని తెలుగుతో పాటు హిందీలోనూ ఏక కాలంలో రూపొందిస్తున్నారు. బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ద్వారా విజయ్ దేవరకొండ బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. కరణ్ జోహార్, అపూర్వమెహతా, హీరూ జోహార్ లతో కలిసి పూరి జగన్నాథ్, చార్మి ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక అతిథి పాత్రలో నటిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ ఇటీవలే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 25న పాన్ ఇండియా వైడ్‌గా ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. రిలీజ్ కి టైమ్ వుండటం, ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. దీంతో సినిమాపై బిజినెస్ పరంగానూ భారీ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది.
రిసెంట్ గా ఈ మూవీ ప్రిరిలీజ్ బిజినెస్ మొదలైంది. ఒక్క నైజాం ఏరియాకే 40 కోట్లు డిమాండ్ చేస్తున్నారట.ఇది చాలా ఎక్కువనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సీడెడ్ రైట్స్ కి 15 కోట్లు అడుగుతున్నారని తెలుస్తోంది. ఈ రేట్లు విన్న వారంతా హీరో విజయ్ దేవరకొండ స్థాయికి చాలా ఎక్కువని అంటున్నారట.
సాధారణంగా స్టార్ హీరోలకు కోట్ చేసే రేట్లని 'లైగర్' మేకర్స్ కోట్ చేయడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిస్తే ఓకే కానీ అలా కాకుండా ఏదైనా జరిగితే విజయ్ దేవరకొండ మార్కెట్ పై ప్రభావం పడుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
అంతే కాకుండా ఈ సినిమా ఫలితం అటు ఇటు అయితే దాని ప్రభావం విజయ్ దేవరకొండ చేస్తున్న'జేజిఎమ్' పై పడుతుంది. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ గా మొదలైన ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ తో ప్రారంభం కాబోతోంది. ఈ నేఫథ్యంలో 'లైగర్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా వుండబోతోంది? .. మేకర్స్ ఊహించిన స్థాయిలోనే ముగియనుందా? అన్నది ఇప్పడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. 'లైగర్' మేకర్స్ డిమాండ్ చేస్తున్న రేట్లని గమనించిన కొంత మంది ఇండస్ట్రీ వర్గాలు ఈ రేంజ్ లో డిమాండ్ చేయడం అత్యాశ అవుతుందేమో అని కామెంట్ చేస్తున్నారట.