ఫోటోటాక్: ఔట్ ఫిట్ లుక్ లో ర‌కుల్ ఎటాక్

Update: 2022-04-01 16:30 GMT
ర‌కుల్ ప్రీత్ సింగ్ కొన్నాళ్ల‌గా బాలీవుడ్ పై ఫోక‌స్ చేసి ముందుకెళ్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రెండు..మూడు చిత్రాల‌తో మెప్పించిన బ్యూటీ త్వ‌ర‌లో `ఎటాక్` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. జాన్ అబ్ర‌హంతో రొమాన్స్ చేసిన బ్యూటీ ఆన్ స్ర్కీన్ రిలీజ్  కి రెడీ అయింది. ఎప్రిల్ 1న సినిమా రిలీజ్ సంద‌ర్భంగా ర‌కుల్ సినిమా ప్రచార కార్య‌క్ర‌మాల్లో చురుకుగా పాల్గొంటుంది. దొరికిన ఏ వేదిక‌ని విడిచిపెట్ట‌డం లేదు. స్పాట్ నే ఫోటో సెష‌న్ స్పెషాల్టీగా మార్చేస్తుంది.

ఇప్ప‌టికే `ఎటాక్` ప్ర‌మోష‌న్ లో భాగంగా వివిధ సిటీల‌కు హాజ‌రైన ర‌కుల్  ఫోటో సెష‌న్స్ ఏ రేంజ్ లో నెట్టింట వైర‌ల్ అయ్యాయో చెప్పాల్సిన ప‌నిలేదు. తాజాగా మ‌రో కొత్త ఫోటోతో ఇన్ స్టాని షేక్ చేస్తోంది. ప‌ర్పెక్ట్ ఔట్ ఫిట్ డిజైన‌ర్ దుస్తుల్లో ర‌కుల్ ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది. లైట్ పింక్ క‌ల‌ర్ బ్యాక్ గ్రౌండ్ లైటింగ్ లో  ర‌కుల్ ఔట్ ఫిట్  లుక్ హైలైట్ అవుతుంది. ర‌కుల్ గ్లామ్ షో స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా  ఫోక‌స్ అవుతుంది.  `ది ఫైన‌ల్ ఎటాక్` అంటూ  కొత్త  ఫోటోని అంత‌ర్జాలంలోకి వ‌దిలింది. చూసి అస్వాదించడం అభిమానుల ప‌నైంది.

అందాల ఆరబోతకు నవతరం అడ్డు చెప్పడం లేదు. కాస్త సీనియర్ నాయిక అయిన రకుల్ ప్రీత్ కూడా తగ్గేదేలే! అంటూ ఎప్ప‌టిక‌ప్పుడు  చెలరేగుతోంది. నేటితరం నాయికలు జాన్వీ కపూర్ - అనన్య - సారా అలీఖాన్ లాంటి వారితో పోటీపడుతోంది. ర‌కుల్ ఇంతకుముందు మాల్దీవుల విహారంలో చెలరేగిన సంగ‌తి తెలిసిందే..  

ఇక ర‌కుల్ సినిమాల విష‌యానికి వ‌స్తే బాలీవుడ్ లో న‌టిగా బిజీగా ఉంది. `డాక్ట‌ర్ జీ` అనే  సినిమాలో న‌టిస్తోంది. చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది.  అలాగే `ఛ‌త్ర‌వాలీ` అనే మ‌రో సినిమాలో  కూడా న‌టిస్తోంది. ఇది షూటింగ్ ద‌శ‌లో ఉంది. `ఎటాక్`..`ర‌న్ వే`..`థాంక్ గాడ్`..`మిష‌న్ సిండ్రాల్లా న‌టిస్తోంది`. వీటిలో కొన్ని చిత్రాలు షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉన్నాయి.

ఇక కోలీవుడ్ లో శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న `ఇండియ‌న్ -2`లో న‌టిస్తోంది. ఈ సినిమాపై ర‌కుల్ చాలా ఆశ‌లు పెట్టుకుంది.  తెలుగులో `31 అక్టోబ‌ర్  లేడీస నైట్` లో న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు..త‌మిళ్ లో తెర‌కెక్కిస్తున్నారు.  టాలీవుడ్ లో పాన్ ఇండియా చిత్రాల్లో అవ‌కాశాలు ఇవ్వాల‌ని  ఆమ‌ధ్య‌ బ‌హిరంగానే కోరిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News