మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఆర్.ఆర్.ఆర్' మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జోరుగా ప్రమోషన్స్ చేస్తున్న మేకర్స్ సినిమాపై అంచనాలు పెంచుకుంటూ వెళ్తున్నారు. దీనికి తగ్గట్టుగానే అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి.
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామా లెన్త్ గురించి నివేదికలు వెలువడ్డాయి. RRR చిత్రానికి హిందీ మరియు తెలుగు వెర్షన్‌లకు రన్ టైమ్ వేర్వేరుగా ఉంటుందని తెలుస్తోంది.
RRR (రౌద్రం రణం రుధిరం) సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు గతేడాది డిసెంబర్ లోనే పూర్తయ్యాయి. దీనికి 3 గంటల 6 నిమిషాల 54 సెకన్ల నిడివితో 'యూ/ఏ' సర్టిఫికేట్ లభించింది.
అయితే ఇప్పుడు తెలుగు వెర్షన్ లో కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఫైనల్ గా 3 గంటల 2 నిమిషాల నిడివితో రాబోతోందని తెలుస్తోంది. అయితే హిందీ వెర్షన్ మాత్రం 3 గంటల 7 నిమిషాల లోపు రన్ టైంతో ఉందని అంటున్నారు.
దీనిని బట్టి తెలుగులో కట్ చేసిన సీన్స్ ని హిందీ వెర్షన్ లో మాత్రం అలానే ఉంచారని తెలుస్తోంది. కానీ బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ RRR హిందీ వెర్షన్ లో 5.01 నిమిషాలు కట్ చేశారని తెలిపారు. ఇప్పుడు 181 నిమిషాల 53 సెకన్లు (3 గంటల 1 నిమిషం 53 సెకన్లు) నిడివితో రాబోతోందని ట్వీట్ చేశారు.
ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా కల్పిత కథతో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని రూపొందించారు. ఇందులో అలియా భట్ - ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు.
అజయ్ దేవగన్ - సముద్రఖని - అలిసన్ డూడీ - రే స్టీవెన్సన్ - శ్రియా సరన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం విడుదల కానుంది