ఎన్టీఆర్ ఖాతాలో అన్ బ్రేకబుల్ రికార్డ్ నమోదైంది. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి సారి కలిసి నటించిన చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ చిత్రం గత కొంత కాలంగా వరుసగా వాయిదా పడుతూ ఎట్టకేలకు మార్చి 25న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
రిలీజ్ రోజు ఫస్ట్ షో నుంచే ఈ మూవీ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ దాదాపు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురు చూపులకు తెరదించుతూ ఈ మూవీ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. అయితే ఈ మూవీతో ఎన్టీఆర్ తాజాగా అన్ బ్రేకబుల్ రికార్డ్ ని సొంతం చేసుకున్నారు. డబుల్ హ్యాట్రిక్ హిట్ లని అందించిన హీరోగా సరికొత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ `అరవింద సమేత` చిత్రం చేసిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ ల తొలి కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ సంచలన విజయాన్ని సాధించింది. ఈ మూవీ తరువాత ఎన్టీఆర్ నటించిన చిత్రం థియేటర్లలోకి వచ్చి దాదాపు మూడున్నరేళ్లవుతోంది. ఇన్నేళ్ల విరామం తరువాత వచ్చిన `ఆర్ ఆర్ ఆర్` ఎన్టీఆర్ కు డబుల్ హ్యాట్రిక్ హిట్ ని అందించి అరుదైన రికార్డ్ ని నెలకొల్పింది.
2015 లో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన `టెంపర్` మూవీతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చారు ఎన్టీఆర్. ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచి మంచి పేరు తెచ్చిపెట్టింది. స్టైలిష్ పాత్రలో నటించిన `నాన్నకు ప్రేమతో` బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఎన్టీఆర్ లోని స్టైలిష్ యాంగిల్ ని పరిచయం చేసింది. ఈ మూవీ 2016లో వచ్చింది. ఇదే ఏడాది కొరటాల శివ డైరెక్ట్ చేసిన `జనతా గ్యారేజ్`లో నటించారు ఎన్టీఆర్.
బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఏ స్థాయి సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ మూవీతో ఎన్టీఆర్ హ్యాట్రిక్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక 2017లో దర్శకుడు బాబితో చేసిన `జై లవకుశ` కూడా బారీ విజయాన్ని అందించింది. ఇది వరుసగా ఎన్టీఆర్ కు దక్కిన నాలుగవ విజయం. ఆ వెంటనే 2018లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన `అరవింద సమేత` విడుదలైంది. సీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్టీఆర్ విజయాల పరంపరని కొనసాగించి వరుసగా ఐదవ విజయాన్ని అందించింది.
ఇక దాదాపు మూడున్నరేళ్ల విరామం తరువాత విడుదలై ట్రిపుల్ ఆర్ తో ఆరవ విజయ్ అంటే డబుల్ హ్యాట్రిక్ అన్నమాట. ఇలా వరుసగా ఆరు సూపర్ హిట్ , బ్లాక్ బస్టర్లతో ఎన్టీఆర్ హ్యాట్రిక్ హిట్ అని సొంతం చేసుకున్న హీరోగా రికార్డుని సొంతం చేసుకోవడం విశేషం.