అక్రమ సంబంధం తప్పు.. 40 పెళ్లిలు అయినా చేసుకుంటా!

Update: 2021-07-25 15:49 GMT
నటి వనిత విజయ్‌ కుమార్‌ మళ్లీ పెళ్లి చేసుకుంది అంటూ ఇటీవల మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. ఆమె పవర్ స్టార్ శ్రీనివాసన్‌ ను పెళ్లి చేసుకున్నట్లుగా ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో అంతా కూడా నాల్గవ పెళ్లి ఇంత త్వరగా వనిత చేసుకుంటుందని తాము ఊహించలేదు అంటూ కామెంట్స్‌ చేశారు. వనిత నాల్గవ పెళ్లి గురించి వార్తలు వస్తున్న సమయంలో వచ్చిన ఫొటో అవ్వడం వల్ల సహజంగానే అంతా కూడా శ్రీనివాసన్‌ ను ఆమె పెళ్లి చేసుకుని ఉంటుందని భావించారు. కాని అనూహ్యంగా ఆమె మాత్రం తాము పెళ్లి చేసుకోలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. వనిత విజయ్‌ కుమార్‌ మీడియా ముందుకు వచ్చి మరీ ఆ ఫొటోలపై క్లారిటీ ఇచ్చింది.

వనిత మాత్రమే కాకుండా శ్రీనివాసన్‌ కూడా మీడియా ముందుకు వచ్చాడు. తాము ఇద్దరం కలిసి ఒక సినిమాను చేస్తున్నాం. ఆ సినిమా కు సంబంధించిన ఫొటో అది. ఫొటోలు బయటకు వచ్చినా కూడా పెళ్లి చేసుకున్నట్లేనా అంటూ వనిత ప్రశ్నించింది. వీరిద్దరు కలిసి నటిస్తున్న సినిమా పికప్ డ్రాప్‌ స్టిల్స్ గా పేర్కొన్నారు. ఈ సినిమాను త్వరలో విడుదల చేయబోతున్నట్లుగా శ్రీనివాసన్‌ పేర్కొన్నాడు. ఇక మీడియా సమావేశంలో వనిత కాస్త సీరియస్ గానే స్పందించింది. ఒక మహిళ మరో వ్యక్తి తో ఫొటో దిగితే పెళ్లి జరిగినట్లుగా ప్రచారం చేస్తున్నారు.

పెళ్లి పెళ్లి అంటూ మీడియా లో గగ్గోలు పెడుతున్నారు. కొందరు నేను మళ్లీ పెళ్లి చేసుకున్నందుకు విమర్శిస్తున్నారు. నా పెళ్లి గురించి వారికి ఎందుకు. వారికి సంబంధించిన విషయాలపై శ్రద చూపించుకుంటే బాగుంటుంది. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అంటూ నెటిజన్స్ పై వనిత అసహనం వ్యక్తం చేసింది. అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారిని పట్టించుకోని ఈజనాలు పద్దతిగా పెళ్లి చేసుకుంటే ఎందుకు విమర్శలు చేస్తున్నారు అంటూ వనిత వ్యాఖ్యలు చేసింది.

తాను నాలుగు అయిదు కాదు నలబై పెళ్లిలు చేసుకుంటాను. అది నా వ్యక్తిగత విషయం. అందుకు ఎవరు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు అంటూ ఆమె హెచ్చరించింది. భాగస్వామి ఉండగా మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం తప్పు. దాన్ని నేరంగా పరిగణించాలి కాని ఎందుకు ఇలా పెళ్లి ని విమర్శిస్తున్నారు అంది. ఇక మరో పెళ్లి ఆలోచన ఉందా అంటే ప్రస్తుతానికి తనకు ఆ ఆలోచన లేదని.. భవిష్యత్తులో ఎలా ఉంటుందో చెప్పలేనంటూ క్లారిటీ ఇచ్చింది.


Tags:    

Similar News