పూజాను లేపి కాజ‌ల్‌ను తొక్కేశారు.. ఫ్యాన్స్ ఊరుకుంటారా?

Update: 2022-04-13 04:36 GMT
మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న త‌న‌యుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన తాజా చిత్రం 'ఆచార్య‌'. అప‌జ‌యం ఎరుగని ద‌ర్శ‌కుడిగా గుర్తింపు సంపాదించుకున్న కొర‌టాల శివ ఈ చిత్రాన్ని రూపొందించ‌గా.. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ల‌పై రామ్ చ‌ర‌ణ్‌, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఇందులో చిరు స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించ‌గా.. చ‌ర‌ణ్‌కు జోడీగా పూజా హెగ్డే చేసింది.

దేవాలయ భూములు ఆక్రమణ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సోనూసూద్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. అలాగే తనికెళ్ళ భరణి, నాజ‌ర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. గ‌త ఏడాదే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 29న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన చిత్ర టీమ్‌.. నిన్న ఆచార్య ట్రైల‌ర్‌ను బ‌య‌ట‌కు వ‌దిలారు.

హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్‌, చిరు-చ‌ర‌ణ్‌ల న‌ట‌న, మణిశర్మ అందించిన బిజిఎమ్ ట్రైల‌ర్‌లో విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. సినిమాపై మ‌రిన్ని అంచ‌నాల‌ను పెంచేసిన ఈ ట్రైల‌ర్ ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో భారీ వ్యూస్‌ను అందుకుంటూ దూసుకుపోతోంది. అయితే అంతా బాగానే ఉంది.. కానీ, ఒక్క విష‌య‌మే క‌ల‌వ‌ర పెడుతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

కొర‌టాల శివ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు మంచి ప్రాధాన్యత ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆచార్య సినిమాలో కాజ‌ల్‌కు కొర‌టాల అన్యాయం చేశాడంటూ టాక్ న‌డుస్తోంది. ఎందుకంటే, నిన్న విడుద‌లైన ట్రైల‌ర్ లో కాజ‌ల్‌ను క‌నీసం ఒక్క‌టంటే ఒక్క‌ షాట్ లో కూడా చూపించ‌లేదు. చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టించిన పూజా హెగ్డేకు మాత్రం ట్రైల‌ర్‌లో మంచి స్పేస్ ద‌క్కింది.

దీంతో కాజల్ పాత్రకి ఈ సినిమాలో పెద్దగా ప్రాధాన్యత ఉండ‌ద‌ని.. సినిమా కథ మొత్తం చరణ్ పాత్ర పై ఆధారపడి నడుస్తుంది కాబట్టి.. పూజ హెగ్డేను లేపి, కాజ‌ల్‌ను తొక్కేశారంటూ నెట్టింట ప్ర‌చారం మొద‌లైంది.

ఇంకేముంది కాజ‌ల్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా కొర‌టాల శివ‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మెయిన్ హీరోయిన్ అయిన కాజ‌ల్‌ను ట్రైల‌ర్ లో ఎందుకు చూపించ‌లేదంటూ ప్రశ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి ఇప్పుడీ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది.
Tags:    

Similar News