నువ్వే నువ్వే కి 20.. మరి శ్రియకి అంటూ షాక్

Update: 2022-10-12 03:30 GMT
నువ్వే నువ్వే సినిమా విడుదల అయ్యి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్‌.. నిర్మాత తో పాటు హీరో హీరోయిన్ ఇంకా చిత్రంలో నటించిన పలువురు నటీ నటులతో గెట్‌ టు గెదర్ ను నిర్వహించారు. ఆ కార్యక్రమంలో తరుణ్ మాట్లాడుతూ ఎమోషనల్‌ అయ్యాడు. అదే సమయంలో త్రివిక్రమ్‌ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. త్రివిక్రమ్‌ తన కెరీర్‌ ఎలా ప్రారంభం అయ్యిందనే విషయాన్ని చెప్పుకొచ్చాడు.

ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ నువ్వే నువ్వే సినిమా తో దర్శకుడిగా పరిచయం అయిన నేపథ్యంలో వివరించడం జరిగింది. అదే సమయంలో శ్రియ మాట్లాడుతూ సినిమా షూటింగ్‌ సందర్భంగా జరిగిన సంఘటనలు మొదలుకుని ఇంకా చాలా విషయాలను మీడియా ముందు షేర్‌ చేసుకుంది.

అంతే కాకుండా ఒక బెస్ట్‌ కో యాక్టర్‌ అన్నట్లుగా తరుణ్ కి కితాబిచ్చింది. అంతే కాకుండా తరుణ్ కి ముద్దు కూడా పెట్టి అందరిని ఆశ్చర్యపర్చింది. ఈ మధ్య కాలంలో శ్రియ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతూ ఉండటంతో చాలా మంది శ్రియ వయసు 30 కి కాస్త ఎక్కువ ఉంటాయని అనుకున్నారు. కానీ తాజాగా నువ్వే నువ్వే 20 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో అంతా నోరు వెళ్లబెడుతున్నారు.

శ్రియ వయసు నలబై ఉంటుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. నువ్వే నువ్వే సినిమాలో నటించే సమయంలో కాస్త అటు ఇటుగా శ్రియ కి 20 ఏళ్లు అయినా ఉండి ఉంటాయి. కనుక ప్రస్తుతం ఆమె వయసు ఈజీగా 40 ఉంటుంది.. లేదంటే ఒకటి రెండు ఏళ్లు తక్కువగా ఉంటుందని అంతా భావిస్తున్నారు. బాబోయ్ శ్రియ నాలుగు పదుల వయసులో కూడా అంతగా అందాల ఆరబోత చేస్తుందా అంటూ చాలా మంది అవాక్కవుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News