వైర‌ల్ గా మారిన త‌మిళ స్టార్ క‌పుల్ కిస్సింగ్‌ ఫొటో

Update: 2022-03-22 09:30 GMT
టాలీవుడ్ లో ప్రేమ జంట‌లు వున్న‌ట్టుగానే కోలీవుడ్ లోనూ ప్రేమించి పెళ్లి చేసుకున్న క్రేజీ జంట‌లు వున్నాయి. అందులో ప్ర‌ముఖంగా వినిపించే పేరు త‌ల అజిత్ కుమార్ - షాలిని. ఈ ఇద్ద‌రు వెండితెర‌పై క్రేజీ స్టార్ లుగా పేరు తెచ్చుకున్నారు. `అద్భుతం` మూవీ స‌మ‌యంలో వీరిద్ద‌రి మ‌ద్య ఏర్ప‌డిన‌ ప్రేమ అది చివ‌రికి వీరి పెళ్లికి దారి తీసింది. వీరి ప్రేమ‌కు ఇరు కుటుంబాలు అంగీకరించ‌డంతో ప్రేమ బంధం కాస్తా ఏడ‌డుగులతో పెళ్లి బంధంగా మారింది. అప్ప‌టి నుంచి షాలిని సినిమాల‌కు పూర్తిగా దూర‌మైంది.

వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు. అయితే సినిమాల‌కు దూరంగా వుంటున్న షాలినికి ఎలాంటి సోష‌ల్ మీడియా అకౌంట్ లేదు. తాను వాడ‌టం లేదు కూడా. తాజాగా వీరిద్ద‌రికి సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది. బ్లూ క‌ర‌ల్ లైటింగ్ లో ఈ జంట కిస్సింగ్ ఫొటో ఒక‌టి తాజాగా నెట్టింట వైర‌ల్ అవుతోంది. కోలీవుడ్ లో స్టార్ క‌పుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట కు సంబంధించిన ఈ త‌ర‌హా ఫొటో  ఇంత వ‌ర‌కు నెట్టింట సంద‌డి చేయ‌డం ఇదే తొలిసారి కావ‌డంతో అజిత్ ఫ్యాన్స్ ఆశ్చ‌ర్య‌పోతున్నార‌ట.

ఇటీవ‌ల జ‌రిగిన ఓ ప్రైవేట్ పార్టీలో త‌ల అజిత్‌, షాలిని పాల్గొన్నారు. ఆ పార్టీలో షాలినిని హ‌గ్ చేసుకుని అజిత్ ఆమె బుగ్గ‌పై కిస్ పెడుతున్న ఫొటో ఇప్పుడు నెట్టింట సంద‌డి చేస్తోంది. ఇలా ఇద్ద‌రూ ఏ ప్రైవేట్ పార్టీలో క‌నిపించ‌లేద‌ట‌. కానీ తాజాగా జ‌రిగిన పార్టీలో అజిత్‌, షాలిని ఇలా హ‌గ్ చేసుకుని క‌నిపించ‌డంతో అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. గ‌డిచిన ఇన్నేళ్ల‌లో వీరికి సంబంధించిన ఈ త‌ర‌హా ఫొటో ఇంత వ‌ర‌కు బ‌య‌టికి రాలేద‌ని, ఇదే తొలిసారని అంతా అంటున్నారు.

2000 సంవ‌త్స‌రంలో వ‌చ్చిన త‌మిళ చిత్రం `అమ‌ర్కాలం`. ఇందులో తొలిసారి అజిత్‌, షాలిని జంట‌గా న‌టించారు. ర‌ఘువ‌ర‌న్ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ మూవీ త‌మిళంలో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఈ మూవీనే తెలుగులో  `అద్భుతం` పేరుతో రిలీజ్ చేశారు. ఇక్క‌డ కూడా స‌క్సెస్ అయింది. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించింది. అది పెళ్లికి దారి తీసింది.

ఇదిలా వుంటే అజిత్ న‌టించిన `వ‌లిమై` ఇటీవ‌ల విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిన ఈ మూవీ తెలుగులో పెద్ద‌గా ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోయినా త‌మిళంలో మాత్రం రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి అజిత్ కెరీర్ లోనే అత్య‌థిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీ త‌రువాత అజిత్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని న‌య‌న‌తార బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివ‌న్ తో చేయ‌బోతున్నారు.
Tags:    

Similar News