అక్కినేని : వంద‌కు దూరం స‌రే..విజ‌యాలయినా ఉండాలి క‌దా !

Update: 2022-05-01 02:30 GMT
కృష్ణా తీరం నుంచి ఇద్ద‌రు న‌ట దిగ్గ‌జాలు వ‌చ్చారు. ఒక‌రు ఎన్టీఆర్ ఒక‌రు ఏఎన్నార్. తిరుగులేని రాజ‌సంతో రాణించారు. తెలుగు చిత్ర సీమ‌కు కొత్త జీవితాన్ని ప్ర‌సాదించి త‌మ‌ను తాము నిరూపించుకున్నారు. పౌరాణిక, జాన‌ప‌ద క‌థ‌ల‌కు కేరాఫ్ ఎన్టీఆర్, కుటుంబ క‌థ‌ల‌కు, విఫ‌ల ప్రేమ క‌థ‌ల‌కు కేరాఫ్ ఏఎన్నార్ అన్న విధంగా రాణించారు. త‌మ‌తో పాటు ఇంకొంద‌రినీ ప్రోత్స‌హించారు.

కొత్త‌వారు వ‌స్తున్నారు బ్ర‌ద‌ర్ , బాగా రాణిస్తున్నారు, వారికి పోటీగా నిలిచి గెల‌వాలంటే మ‌నం ఇంకా అప్డేట్ కావాలి అని ఎన్టీఆర్ ఓ సంద‌ర్భంలో చిరును ఉద్దేశించి అన్నారు. ఆ గొప్ప మ‌నిషి మాట‌ల ప్ర‌భావం ఇప్ప‌టికీ ఉంది ఇండ‌స్ట్రీ పై ! ఆ ప్ర‌వాహం ఇప్ప‌టికీ ఉంది ఇండ‌స్ట్రీలో !

ఎన్టీఆర్, ఏఎన్నార్ త‌రువాత న‌ట వార‌సులు వ‌చ్చారు. బాల‌య్య, నాగ్ ఇంకా ఇంకొంద‌రు. వీరిలో బాల‌య్య‌కు తిరుగులేదు అని చెప్ప‌లేం. కానీ వైఫ‌ల్యాల‌ను దాటుకుని వ‌చ్చిన తీరు బాగుంటుంది. మాస్ ప‌ల్స్ తెలిసిన హీరో. ఓ విధంగా నంద‌మూరి అభిమానుల‌కే కాదు చాలా విష‌యాల్లో ఎంద‌రికో న‌చ్చుతారు ఆయ‌న. ముఖ్యంగా నాన్న నేర్పిన క్ర‌మ‌శిక్ష‌ణే త‌న‌ను ఇంత‌టి వాణ్ని చేసింద‌ని అంటారు బాల‌య్య. కొన్ని విమ‌ర్శ‌లు ఉన్నా వాటిని కూడా అంగీక‌రిస్తారు. ఒప్పుకుంటారు. ఒకానొక స‌మ‌యంలో ఇది త‌ప్పు అని చెప్పి చూసిన వాళ్ల‌ను అర్థం చేసుకున్నారు.తమ త‌ప్పు తెలుసుకున్నారు బాల‌య్య. అదేవిధంగా నాగ్ కూడా !

ప్ర‌యోగాల‌కు కేరాఫ్ ఆయ‌న. ఎంత కాద‌న్నా ఆయ‌న ఏఎన్నార్ ఇంటి బిడ్డ. కృష్ణ‌వంశీ, సందీప్ చౌతా (మ్యూజిక్ డైరెక్ట‌ర్), అనూప్ రుబెన్స్  (మ్యూజిక్ డైరెక్ట‌ర్), క‌ల్యాణ కృష్ణ కుర‌సాల ఇంకా చెప్పాలంటే అన్న పూర్ణ కాంపౌండ్ నుంచి వ‌చ్చిన ప్ర‌తిభా వంతులు ఎంద‌రో. యువ ప్ర‌తిభావంతులు అని రాయాలి. రామ్ గోపాల్ వ‌ర్మ లాంటి వారితో ప్ర‌యోగాలు చేశారు. నీకు డైరెక్ష‌న్ కాదు రావాల్సింది క‌థ‌ను చెప్ప‌డం.. అది వ‌స్తే చాలు నీకు తిరుగేలేదు అని ఎంద‌రికో న‌మ్మ‌కం ఇచ్చారు. కొత్త వారికి ఆస‌రా అయ్యారు. ఇప్పుండెందుకు ఈ ఫెయిల్.

ల‌వ్ స్టోరీ కానీ బంగార్రాజు కానీ గొప్ప విజ‌యాలు అయితే కావు. కానీ చై కెరియ‌ర్ ను కాస్త గాడిలో పెట్టిన‌వే ! ఇక బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా పెద్ద‌గా ఆకట్టుకోలేదు. అలా అని ఫ్లాప్ అని తీసిపారేయ్య‌లేం. హిట్ అని జే గంట‌లు మోగించ‌లేం. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ ఇవాళ నాగార్జున తో స‌హా ఆయ‌న న‌ట వార‌సులు కూడా డైల‌మాలో ఉన్నారు.

వారికి వంద కోట్ల క్ల‌బ్ అన్న‌ది ఓ క‌ల. ఆ క‌ల కూడా నెర‌వేర‌డం లేదు.ఇంకా బాహుబ‌లి స్థాయి విజ‌యం ఒక్క‌టైనా అందుకోవాలి అన్న క‌ల కూడా నాగ్ కు ఉంది కానీ ఎందుక‌నో ఆ సాహ‌సం అయితే అన్న‌పూర్ణ స్టూడియో చేయ‌లేక‌పోతోంది.
Tags:    

Similar News