కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యేంత వరకు ప్రేక్షకుల రిజల్ట్ బయటికి వచ్చేంత వరకు హిట్టా ఫట్టా అన్నది మేకర్స్ కి కానీ ఆ సినిమాని రూపొందించిన దర్శకుడికి గానీ తెలియదు. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఫ్లాప్ అనే విషయం రిలీజ్ కి ముందే తెలిసిపోతూవుంటుంది. లోపం ఎక్కడ జరిగిందో తెలిసినా చివరి నిమిషంలో ఏమీ చేయలేక చేతులెత్తేస్తూ వుంటాయి. ఇదే తరహాలో యంగ్ డైరెక్టర్ చందూ మొండేటి తను రూపొందించిన సినిమా విషయంలో జరిగిందట.
చందూ మొండేటి రూపొందించిన లేటెస్ట్ సూపర్ నేచురల్ మిస్టిక్ థ్రిల్లర్ మూవీ `కార్తికేయ 2`. 2014లో విడుదలైన `కార్తికేయ`కు సీక్వెల్ గా ఈ మూవీని తెరకెక్కించారు. నిఖిల్ హీరోగా నటించిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ సీరియర్ నటుడు అనుపమ్ ఖేర్ నటించారు.
శ్రీకృష్ణుడు, ద్వారక నేపథ్యంలో దాగివున్న మిస్టరీ నేపథ్యంలో ఆసక్టికర కథ, కథనాలతో రూపొందిన ఈ మూవీని ఆగస్టు 13న విడుదల చేస్తున్నారు.
తెలుగుతో పాటు పాన్ ఇండియా మూవీగా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. రిలీజ్ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ ని ప్రారంభించింది. ఈ సందర్భంగా దర్శకుడు చందూ మొండేటి ఓ మీడియాతో ముటిస్తూ పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. తను చేసిన `సవ్యసాచి` మూవీ గురించి షాకింగ్ విషయాల్ని చెప్పుకొచ్చాడు.
ఈ సినిమా విషయంలో ఎక్కడో కన్ఫ్యూజ్ అయ్యానని అదే సినిమాకు తేడా కొట్టిందన్నాడు. ఇక సినిమా రిలీజ్ కు ఐదు రోజుల ముందే సినిమా ఫ్లాప్ అవుతుందని తనకు తెలిసిపోయిందని షాకింగ్ విషయాన్ని ఈ సంర్భంగా బయటపెట్టాడు.
ఫైనల్ కాపీ చూసుకున్నాక సినిమా లేడా కొట్టిందని తెలిసిపోయిందని, సినిమా విషయంలో నేను అనుకున్న బేసిక్ లైన్, మాధవన్ పాత్ర ఇలా అన్ని తప్పుల మీద తప్పులు జరిగిపోయి సినిమా ఫలితం విషయంలో తీవ్ర ప్రభావాన్ని చూపించాయన్నాడు.