'ఆచార్య' రిలీజ్ కౌంట్ డౌన్ మొదలైంది. విడుదలకి ఇంకా నాలుగు రోజులే సమయం ఉంది. దీంతో మరోవైపు ప్రచారం జోరుగా సాగుతోంది. తండ్రీ-కుమారులు చిరంజీవి-రామ్ చరణ్ లు ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. మొదటిసారి ఈ త్రయం వెండి తెరపై కీలక పాత్రలో మెప్పించడానికి రెడీ అవుతున్నారు. గెస్ట్ రోల్ గా ఎంటర్ అయిన పాత్ర సినిమాలో ఆద్యంతం ఆకట్టుకోవడమే కాక నిడివి కూడా ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.
డాన్సుల విషయంలో తండ్రితోనే తనయుడి పోటీకి సై అన్నాడు. చిరంజీవి 'ఆచార్య' పాత్ర పోషిస్తుంటే..అందులో ఆచార్య శిష్యుడు సిద్ద పాత్రలో నటిస్తున్నాడు. ఈ రెండు పాత్రల యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణ నిలుస్తాయని తెలుస్తోంది. కొరటాల మార్క్ సెన్సిబుల్ యాక్షన్ తో ఆద్యంతం ఆకట్టుకుంటారని అంచనాలు నెలకొంటున్నాయి.
తాజాగా చిరంజీవి-చరణ్ కొత్త పోస్టర్ ఒకటి రిలీజ్ అయింది. ఇందులో చరణ్-చిరంజీవిలను ఇప్పటివరకూ చూడని డిఫరెంట్ లుక్ లో రిలీజ్ చేసారు. ఆ పోస్టర్ చూసిన తర్వాత సినిమాలో ఇలాంటి యాంగిల్ కూడా ఉంటుందా? అన్న సందేహం రాక మానదు. అవును తండ్రీ కొడుకులిద్దరు ఆర్మీ వార్ దుస్తుల్లో యుద్దానికి సంసిద్దమైనట్లు రివీల్ చేసారు.
ఓ కొండ ప్రాంతంలో వెనుక జీపులు..ముందు ఆచార్య..సిద్దలు షర్ట్ మడతెట్టి యెగ్రసివ్ లుక్ లో కనిపిస్తున్నారు.ఈ దుస్తుల్లో చిరు-చరణ్ లు లోడ్ చేసిన గన్స్ లా హైలైట్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
ఇప్పటివరకూ చరణ్-చిరు లుక్ లు ఒక యాంగిల్ లోనే హైలైట్ అయ్యాయి. ధర్మస్థలి కోసం హీరోలిద్దరి పోరాటాన్ని నక్సల్స్ దుస్తుల్లో హైలైట్ చేసారు. తాజాగా కొత్త పోస్టర్ తో సినిమాలో అంతకు మించి స్పెషల్ ఉందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
ఈ సినిమాని దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్లు సమాచారం. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ- మ్యాట్ని ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. నిరంజన్ రెడ్డి- అవినాశ్ రెడ్డి నిర్మాతలు. మణిశర్మ సంగీతం అందించారు. పూజాహెగ్డే చరణ్ కి జోడీగా నటించింది. సంగీత కీలక పాత్ర పోషించారు.