ట్రైలర్ టాక్: ఇకపై మన రాజ్యం మొదలవుతుందిగా..?

Update: 2019-04-29 16:01 GMT
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన 'NGK -నంద గోపాల కృష్ణ' ట్రైలర్ ఈరోజే రిలీజ్ అయింది.  సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్లో సూర్యకు జంటగా సాయి పల్లవి.. రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు.  ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు నంద గోపాల కృష్ణ.  మరి మూడు షేడ్స్ ఉండే క్యారెక్టరైజేషన్ కోసం అలా పెట్టారేమో తెలియదు కానీ ట్రైలర్ లో మాత్రం అలా మూడు షేడ్స్ ను స్పెసిఫిక్ గా గుర్తించేలా లేవు.

ఇక ట్రైలర్ లో చూపించిన కాన్సెప్ట్ విషయానికి వస్తే.. రాజకీయాలు కుళ్ళు అని అందరం అంటాం.. అందులోకి వెళ్తే మనకేమవుతుందో అని పేరెంట్స్ భయపడుతూ ఉంటారు. ఒకవేళ నిజంగానే ఎంట్రీ ఇస్తే అక్కడ ఆల్రెడీ పాతుకుపోయిన పాతకాపులు మనల్ను బతకనివ్వరు.  ఇది అందరికీ తెలుసు.  కానీ హీరో సూర్య అలా అనుకోడు. "ఇలా చదువుకున్న వాళ్ళంతా మనకెందుకని పారిపోవడం వల్లే ఈ దేశం నాశానమైపోయింది" అంటూ దేశం ఎమైపోతోందోనని బాధపడే వ్యక్తి. అందుకోసం ఏమైనా చేయాలని తపించే వ్యక్తి. కానీ అమ్మ మాత్రం వద్దంటుంది. మనలను బతకనివ్వరు అంటుంది. తోడుగా ఉన్న సాయిపల్లవి (భార్య పాత్రేమో కానీ క్లారిటీ ఇవ్వలేదు) "నిజం చెప్పాలంటే మన స్వతంత్రాన్ని బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని రాజకీయ నాయకులకు ఇచ్చేశాం." అని సూర్యకు వత్తాసు పలుకుతుంది.

ఇలాంటి పరిస్థితిలో తెగించి రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తాడు సూర్య. వెనకాలే అనుచరుల గుంపు కూడా తయారవుతుంది. ఎన్జీకే.. ఎన్జీకే" అని అరుస్తూ ఉంటారు.  అదే సమయంలో "ఒక చిన్న గుంపునేసుకొని వచ్చేస్తే నిన్ను రాజకీయాలోకి రానిస్తారని అనుకున్నావా?" అంటూ బెదిరింపులు కూడా స్టార్ట్ అవుతాయి. సుర్యపై.. సూర్య సన్నిహితులపై దాడులు కూడా స్టార్ట్.  ఒక ఫైట్ లో సూర్య "బొమ్మలు గీసేవాడు కొడుక్కి ఏం నేర్పిస్తాడు?" అని ప్రశ్నిస్తాడు. "బొమ్మలు గీయడం." అని అవతలి వైపు నుంచి సమాధానం వస్తుంది.  ఇక దానికి రెస్పాన్స్ గా  "మరి మానాన్న మిలిటరీ రా.. గోలీలు ఆడుకోవడం నేర్పిస్తాడా?" అంటూ పవర్ఫుల్ ఆన్సర్ ఇస్తాడు. ఇదిలా ఉంటే హీరో అమ్మ "ఈ దేశంలో ఒక్కొక్కడికి ఒక్కోదానిమీద పిచ్చి. ఆడికి దేశం మీద పిచ్చి" అంటూ తన కొడుకున్న పిచ్చిని గురించి అందంగా చెప్తుంది.  ట్రైలర్ ఫైనల్ టచ్.. "బాబూ ఇకపై మన రాజ్యం మొదలవుతుందిగా..?" అంటూ ఫోన్లో ఒకరు అడుగుతారు.  దీనికి సమాధానంగా సూర్య "అవుతుంది ఇక చూడు" అంటాడు.

ఓవరాల్ గా ట్రైలర్ చూస్తే కాన్సెప్ట్ కొత్తది కాదు కానీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇలా సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన హీరో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం.. ప్రజల పక్షాన నిలబడి పోరాడడం అనేది ప్రేక్షకులను మెప్పించే అంశమే. ట్రైలర్ మొత్తం సూర్య విశ్వరూపమే ఉంది.  హీరోయిన్లకు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు.  అటు విలన్ నూ చూపించలేదు.  మాస్ ను మెప్పించే చిత్రంలాగా అయితే ఉంది.  ఇంకెందుకు ఆలస్యం.. ఈ నంద గోపాల కృష్ణ ను చూసేయండి.

Full View
Tags:    

Similar News