ఒంట‌రి దీవిలో ఎర్ర‌బికినీ

Update: 2018-11-05 09:07 GMT
ఒంట‌రి దీవిలో విలాసాల యాంక‌రు.. ఒంపు సొంపుల్ని దోర దోర‌గా వడ్డించింది.. వ‌య్యారాల వ‌డ్డ‌న‌ల‌తో విరుచుకుప‌డింది. రెడ్ బికినీలో స్పెష‌ల్ ట్రీట్ తో మ‌తి చెడ‌గొట్టింది. ఇంత‌కీ ఎవ‌రీ కొంటె కోనంగి.. న‌వ‌య‌వ్వ‌న‌ సోయ‌గాల మ‌ల్లిక‌?.. అందాల న‌వ‌లా కాంత‌!.. ఎవ‌రు నీవు అంటే .. మోడ‌లింగ్ నుంచి బుల్లితెర‌కు  ప్ర‌మోటైన డ్యాషింగ్ గాళ్‌ నియా శ‌ర్మ ఈవిడే. క‌త్రిన‌ - ఆలియా త‌ర్వాత అంత‌టి సెక్సీ గాళ్ అన్న పిలుపును అందుకుందీ భామ‌. ఆసియాలోనే సెక్సీయెస్ట్ ఉమెన్ గా కితాబందుకున్న ఈ అంద‌గ‌త్తెకు ఆ అర్హ‌త ఎందుకు ద‌క్కిందో ఈ ఫోటోనే సాక్ష్యం.

ఈ బుల్లితెర యాంజెల్ మారిష‌స్ వెకేష‌న్ నుంచి వేడెక్కించే ఫోటోల్ని అంత‌ర్జాలంలోకి విసిరేసింది. అట్నుంచి క్యాచ్ చేయ‌డం యువ‌తరం వంతు అయ్యింది. జీటీవీలో `జ‌మై రాజా` షోతో నియా శ‌ర్మ పాపులారిటీ స్కైని ట‌చ్ చేసింది. నియాని సామాజిక మాధ్య‌మాల్లో దాదాపు 30ల‌క్ష‌ల మంది ఫాలో చేస్తున్నారంటే త‌న క్రేజు ఎంతో అర్థం చేసుకోవ‌చ్చు. నియా ప్ర‌స్తుతం క‌ల‌ర్స్ టీవీలో `ఇష్క్ మే మార్జవాన్` రివెంజ్ డ్రామాలో వేడెక్కిస్తోంది.

వీట‌న్నిటినీ మించి వెబ్ సిరీస్‌ ల‌తోనూ అంతకు మించిన పాపులారిటీ తెచ్చుకుంటోంది. విక్ర‌మ్ భ‌ట్ నిర్మిస్తున్న వెబ్ సిరీస్ `ట్విస్టెడ్‌` - `ట్విస్టెడ్ 2` వెబ్ సిరీస్‌ ల‌లో నాయిక‌గా అద‌ర‌గొడుతోంది. హాటీ.. నాటీ.. బాంబ్ షెల్ లాంటి ప‌దాలకు దొర‌క‌ని రేంజు నియాకి ఉంది. అందుకే ఈ భామ ప్ర‌స్తుతం వెండితెర అవ‌కాశాల కోసం వేట సాగిస్తోంది. త్వ‌ర‌లోనే భ‌ట్స్ క్యాంప్‌ లో భారీ చిత్రాల్లో న‌టించ‌నుందిట‌.
Tags:    

Similar News