నియా శర్మ అనగానే గుర్తు పట్టేవాళ్లు తక్కువే. హిందీ సీరియళ్లలో హిట్ అయిన కోడలు ఈమె. కత్రినా కైఫ్ - అలియా భట్ వంటి అందాల తారలను సైతం వెనక్కి నెట్టి ఆసియాలోనే శృంగార తారల జాబితాలో మూడో స్థానం దక్కించుకుంది. బాలీవుడ్ తారలను మించిన పాపులారిటీని సంపాదించుకుంది. ఈమె ఫోటోలు చూస్తూ హాలీవుడ్ హాట్ స్టార్లను గుర్తుకుతెస్తుంది. అందంతో పాటూ అమ్మడికి సెన్సాఫ్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కువే. పద్మావత్ సినిమాకు ఎంత తెలివిగా సపోర్ట్ చేసిందో చూడండి.
మేవార్ రాణి పద్మిని జీవిత కథ ఆధారంగా పద్మావతి సినిమాను నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పటి నుంచే రాజపుత్రులు అల్లర్లు చేస్తూనే ఉన్నారు. రెండు మూడు సార్లు షూటింగ్ స్పాట్ ను తగుల బెట్టడం - దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ మీద దాడి చేయడం వంటి ఘటనలు జరిగాయి. కొన్ని రాష్ట్రాల్లో ఆ సినిమాను ప్రభుత్వాలే నిషేధించాయి కూడా. కానీ సుప్రీం కోర్టుకు సినిమాకు అండగా నిలిచింది. సెన్సార్ బోర్టు ఓకే చేసిన సినిమాను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని తేల్చి చెప్పింది. కష్టాలన్నింటినీ దాటుకుని పద్మావతి.... పద్మావత్ గా మారి జనవరి 25న విడుదల అవుతోంది. ఈ సమయంలో సీరియళ్ల హాట్ బ్యూటీ నియా ట్విట్టర్ లో సరైన సెటైర్ వేసింది.
అల్లర్లు, గొడవలు చేయమని వందల మందిని ఒకే ఒక్కరు ఎలా కన్విన్స్ చేస్తారో... నేను నా ముగ్గురు స్నేహితులను సరదాగా కలుద్దామని కూడా కన్విన్స్ చేయలేను... అని ట్విట్టర్ లో కూసింది నియా. ఆమె సెటైర్ మీకు అర్థమయ్యే ఉంటుంది. పద్మావత్ సినిమాపై అల్లర్లపైనే ఆమె సెటైర్ వేసింది.