ప్రియురాళ్ల‌ను వ‌దిలేసేంత‌గా పీసీలో ఏం ఉంద‌ని?

Update: 2021-03-10 08:30 GMT
భార‌తీయ యువ‌తి.. అందాల క‌థానాయిక ప్రియాంక చోప్రాని పెళ్లాడాడు అమెరిక‌న్ సింగ‌ర్ కం న‌టుడు నిక్ జోనాస్. ఈ జంట ఆద‌ర్శ‌జీవ‌నం ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. నిక్ - పీసీ అన్యోన్య‌త అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఈ జంట‌ను విడ‌దీసేందుకు ఏకంగా ఓ ప్ర‌ముఖ ఆంగ్ల మ్యాగజైన్ కుట్ర పూరిత‌మైన క‌థ‌నాన్ని వెలువ‌రించ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌న‌మే అయ్యింది.

అన్నిటినీ అధిగ‌మించి అమెరికా కోడ‌లు సంసారాన్ని స‌జావుగా సాగించ‌డం అంద‌రినీ ఔరా! అనిపించేస్తోంది. ఈ జంట అన్యోన్య‌త‌కు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్ప‌టికే ఇంట‌ర్నెట్ లో అగ్గి రాజేస్తున్నాయి. ఇలాంటి వేళ నిక్ జోనాస్ కి గ‌త ఎఫైర్స్ గురించి ఓ ప్ర‌శ్న ఎదురైంది.

ఇత‌ర గాళ్స్ నుంచి దూరం జ‌ర‌గ‌డానికి పీసీలో ఏం చూశారు? అన్న ప్ర‌శ్న‌కు.. స్పందించాడు నిక్. మా ఇద్ద‌రి మ‌ధ్యా స్నేహం ఒక‌రినొక‌రం అర్థం చేసుకోవడానికి ఉప‌యోగ‌ప‌డింద‌ని నిక్ స‌మాధాన‌మిచ్చారు. పెళ్లికి ముందే స్నేహం ప్రేమ‌.. దాని వ‌ల్ల‌నే ఇత‌ర మ‌గువ‌ల నుంచి దూరం చేసింద‌ని తెలిపారు. తాను గతంలో డేటింగ్ చేసిన ఇతర మహిళల నుండి వేరు చేయ‌గ‌లిగిన అంశంపై నిక్ జోనాస్  క్లారిటీనిచ్చేశారు.

అమెరికన్ గాయకుడు త‌మ‌ బంధాన్ని బలోపేతం చేయడానికి సహాయపడేంత బలమైన స్నేహం త‌మ మ‌ధ్య‌ ఉందని చెప్పారు. సిరియస్ ఎక్స్‌.ఎమ్ అనే మీడియాకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూ‌లో తన కొత్త ఆల్బమ్ `స్పేస్ ‌మ్యాన్`‌ను ప్రచారం చేస్తున్నప్పుడు ప్రియాంకతో తనకున్న సంబంధం గురించి అతను డేటింగ్ చేసిన ఇతర భామ‌ల గురించి చెప్పారు.

``మేము చాలా అదృష్టవంతులం. సరిగ్గా డేటింగ్ ప్రారంభించడానికి ముందు ఒకరికొక‌రం బాగా తెలుసు. సానుకూల ఆలోచ‌న‌ల‌తో మంచి పద్ధతిలో ఉద్భవించిన సంబంధాలకు స్నేహంతో పునాది ఎల్లప్పుడూ సహాయపడుతుందని నేను భావిస్తాను. పెళ్ల‌యిన‌  మొదటి రెండు సంవత్సరాల‌లో.. నేను ఆధారపడే న‌మ్మ‌క‌మైన జీవిత భాగస్వామిని పొంద‌డం గొప్ప‌ ఆశీర్వాదం. ప్ర‌తిదీ ఆశాజనకంగా ఉంది`` అన్నారాయన.

ప్రియాంక - నిక్ జోడీ 2018 లో ఉదయపూర్ లో ఘ‌నంగా వివాహం చేసుకున్నారు. తన ఆల్బమ్ `స్పేస్ మాన్` లోని చాలా పాటలు తన భార్యకు ప్రేమలేఖలు అని ఆయన ఇంతకు ముందు వెల్లడించారు.
Tags:    

Similar News