ఇస్మార్ట్ భామ ఫిలాసఫీ సూపర్ గా ఉందే

Update: 2019-06-07 09:57 GMT
ప్రతి విషయానికి నాణేనికి బొమ్మా బొరుసు లాగా రెండు వైపులు ఉంటాయి.   సోషల్ మీడియా కూడా అందుకు ఎక్సెప్షన్ కాదు.  మంచి ఉంటుంది.. చెడూ ఉంటుంది.  ట్రోల్స్ సంగతే తీసుకుంటే ఎవరినైతే ట్రోల్ చేస్తున్నారో వారికి ఇబ్బందిగా ఉంటుంది. మిగతా జనాలకు అది ఫన్.  అయితే ఏవో సున్నితమైన విమర్శలు చేస్తే  పోనీలే అని సరిపెట్టుకోవచ్చు కానీ మన హీరోయిన్లను సోషల్ మీడియాలో మరీ దారుణంగా ట్రోల్ చేస్తారు.  మరి ఇలాంటి ట్రోల్స్ పై మిగతా హీరోయిన్లు ఎలా స్పందిస్తారో తెలియదు కానీ నిధి అగర్వాల్ మాత్రం వాటిని అసలు పట్టించుకోను అని తేల్చి పారేసింది.

నిధి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్లలో ఒకరు.  రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ పోస్ట్ చేస్తూ నిత్యం అభిమానులతో.. నెటిజనులతో టచ్ లో ఉంటుంది.  అయితే ఈమధ్య ఒక ఫోటో షూట్ లో పాల్గొని కొన్ని హాట్ ఫోటోలు పోస్ట్ చేసింది. ఇంకేముంది.. కొందరు ట్రోలర్లు రెచ్చిపోయి గలీజు కామెంట్లు పెట్టారు.  ఈ విషయంపై ఒక అభిమాని వాళ్ళకు గట్టిగా రిప్లై ఇవ్వచ్చు కదా అని నిధిని అడిగితే "అలాంటి వేస్ట్ జనాల మాటలను నేను అసలు పట్టించుకోను.. నాది మొద్దు చర్మం" అని చెప్పింది.  మొద్దుచర్మం అంటే.. నిజంగా మొద్దు చర్మం అనుకునేరు.  ఇంగ్లీష్ లో ఆమె థిక్ స్కిన్ అని చెప్పింది.  కొన్నిటిని తెలుగులోకి డైరెక్ట్ గా అనువదిస్తే తెగులు తగిలిన పదాల్లాగ మారిపోతాయి కదా.  నిధి చెప్పిన దాన్ని సాఫ్ట్ గా  చెప్పుకోవాలంటే "ట్రోలర్లు ఎంగిలాకుల్లా ఎగిరెగిరి పడ్డా నాకు చీమ కుట్టినట్టు కూడా ఉండదు" అనే ఉద్దేశం అన్నమాట.

ఇక నిధి సినిమాల విషయానికి వస్తే ఇప్పటివరకూ తెలుగులో 'సవ్యసాచి'.. 'Mr. మజ్ను' సినిమాలో నటించింది.  ప్రస్తుతం పూరి జగన్నాధ్-రామ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ఇస్మార్ట్ శంకర్ లో ఒక హీరోయిన్ గా నటిస్తోంది.  'ఇస్మార్ట్ శంకర్' జులై 12  TK న రిలీజ్ కానుంది.


Tags:    

Similar News